Homeజాతీయ వార్తలురైతుల ఆందోళనలపై వెనక్కి తగ్గని ప్రభుత్వం..!

రైతుల ఆందోళనలపై వెనక్కి తగ్గని ప్రభుత్వం..!

farmers protest

కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలు ఆగడం లేదు. ప్రభుత్వం, రైతులు ఎవరికి వారే పట్టు వీడకపోవడతో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతులతో ప్రభుత్వం ఇప్పటికీ ఆరు సార్లు చర్చలు నిర్వహించింది. అయినా పరిష్కారం లభించకపోవడంతో రైతులు ఆందోళన సాగిసస్తూనే ఉన్నారు. మరోవైపు మంగళవారం సాయంత్రం అమిత్ షా రైతులతో జరిపిన చర్చల్లోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో రైతులు ఆందోళను విరమించకపోవడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించారు.

Also Read: విజయనగరం జిల్లా టీడీపీలో ముసలం..! అశోక్ గజపతి రాజుకు కొత్త సమస్య..?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం పూర్తిగా రద్దు చేసే వరకు తాము ఆందోళన విరమించని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. అయితే ప్రభుత్వం ఒక్కసారి చట్టాలను చేసిన తరువాత దానిని మార్చడం కుదరదని, అయితే చట్టంలో కొన్ని సవరణలు చేసిన ప్రతిపాదనను రైతుల ముందు ఉంచింది.

ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేయడం, మార్కెట్ కమిటీలపై రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం, ప్రైవేట్ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, ప్రైవేట్ తో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పు, కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ లాంటి ప్రాతిపాదనుల ఉన్నాయి.

దీనికి రైతులు ససేమిరా అంటున్నారు. వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయడం తప్ప తమకు ఇంకే ప్రతిపాదనకు ఒప్పుకోమని అంటున్నారు. అంతే కాకుండా ఈనెల 14 వరకు తమ ఆందోళనకు సంబంధించిన కార్యాచరణను కూడా ప్రకటించారు.

Also Read: చావుదెబ్బ తిన్నా కాంగ్రెస్ మారదా?.. అప్పటి వరకు ఉత్తమే టీపీసీసీ చీఫ్..!

12న ఢిల్లీ-జైపూర్ రహదారి, దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల దిగ్బంధం, ఆ తరువాత బీజేపీ నాయకుల ఘోరావ్, 14న దేశవ్యాప్త ఆందోళననలు, పలు సంస్థల ఉత్పత్తుల బహిష్కరణ లాంటి కార్యక్రమాలను రైతులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇక ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ రైతులు ఆందోళనలను విరమించడం లేదు. కేంద్రం ఎన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చినా ఒప్పుకోమని, అవసరమైతే ఏడాదైనా సరే ఆందోళన నిర్వహిస్తామని రైతులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular