Agneepath Protest- Damera Rakesh: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం ఎంతటి గందరగోళం సృష్టించిందో తెలిసిందే. జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లకు నిప్పుపెట్టిన నిరుద్యోగులు నానా హంగామా చేశారు. దీంతో దేశం యావత్తు ఉలిక్కిపడింది. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దని హెచ్చరిస్తూ నిరుద్యోగులు రాద్ధాంతం చేసిన సంగతి చూశాం. ఈనేపథ్యంలో నిరుద్యోగుల ఆగ్రహానికి రాజధాని హైదరాబాద్ అతలాకుతలమైంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్లకు నిప్పు పెట్టడంతో పరుగులు పెట్టారు. ఫలితంగా ఎలాంటి ప్రమాదం జరిగిందో తెలుసుకున్నాం.

ఈ సందర్బంగా జరిగిన గొడవల్లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం డబీర్ పేటకు చెందిన దామెర రాకేష్ పోలీసు కాల్పుల్లో మృతిచెందాడు. దీంతో రాష్ట్రప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారాన్ని అందజేసింది. దీంతో పాటు రాకేష్ సోదరుడు రామరాజుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు సుమఖత వ్యక్తం చేసింది. దీంతో బాధిత కుటుంబానికి ఊరట లభించినట్లు అయింది. ప్రభుత్వ నిర్ణయంతో రాకేష్ కుటుంబం సాంత్వన చెందింది.
Also Read: AP High Court: ‘అంబేద్కర్ కోనసీమ’నే జగన్ సంచలనం.. అల్లర్ల పిటీషన్ పై హైకోర్టు సీరియస్..
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాకేష్ సోదరుడు రామరాజుకు అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ ముందు చూపును అందరు స్వాగతిస్తున్నారు. ఉద్యోగ వేటలో అసువులు బాసిన రాకేష్ కుటుంబానికి ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల్లో ప్రశంసలు వస్తున్నాయి.

సీఎం కేసీఆర్ పెద్ద మనుసుకు ఫిదా అవుతున్నారు. రాకేష్ కుటుంబాన్ని ఆదుకోవడం ఆహ్వానించదగినదే. అగ్నిపథ్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. అగ్నిపథ్ లో ఉద్యోగాల కోసం నియామక ప్రక్రియ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన ఆందోళనల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కొనసాగడానికి మార్గం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం అగ్నిపథ్ ను కొనసాగించడానికే మొగ్గు చూపుతోంది.
Also Read:Uddhav Thackeray: హవ్వా.. వెన్నుపోటు గురించి శివసేన ‘ఉద్దవ్’ మాట్లాడుతున్నారు