Naresh and Pavithra Lokesh: వీరు ఇంకా పెళ్లే చేసుకోలేదు.. అప్పుడే విడాకుంలేంటి.. అనే డౌట్ రావచ్చు. అయితే వీరిద్దరు విడాకులు తీసుకోవడం కాదు.. వారి నరేశ్ మూడో భార్య, పవిత్ర భర్త నుంచి ఇంకా వీరు అధికారికంగా విడాకులు తీసుకోలేదు. ఆ తరువాత పెళ్లి చేసుకుంటారన్న కొత్త చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ పెళ్లి చేసుకుంటరాన్న వార్తలపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. కొంత కాలంగా వీరు అన్యోన్యంగా ఉండడంతో త్వరలో పెళ్లి చేసుకుంటారనన వార్తలు గుప్పుమనడంతో చివరికి ఈ జంట ఒక్కటి కానున్నట్లు క్లారిటీ వచ్చింది. అయితే వీరి వివాహ సమస్యకు విడాకులు అడ్డంకిగా మారాయి.

నరేశ్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరిలో మూడో భార్యతో ఆయన మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు సోదరుడి కూమార్తె అయిన ఆమె ఇటీవల వార్తల్లో వచ్చారు. తనకున్న అధికార, సినీ రంగం అండంతో కొందరి దగ్గర అధిక వడ్డీ ఇస్తానని డబ్బులు వసూలు చేసింది. అయితే ఆ తరువాత వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తోంది. దీంతో ఐదుగురు మహిళలు కొన్ని నెలల కిందట గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో నరేశ్ పేరు కూడా మీడియాలో రావడంతో ఆమెతో తనకు సంబంధం లేదని, తనతో దూరంగా ఉంటున్నానని క్లారిటీ ఇచ్చారు. అయితే వీరు ఇంకా విడాకులు తీసుకోలేదు.
ఇటు పవిత్ర తన భర్తతో దూరంగా ఉంటోంది. ఆయనను పవిత్ర పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేస్తున్నారు. కొన్ని నెలల కిందట వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. కానీ విడాకులు తీసుకోలేదు. ఈ సమయంలో తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పవిత్ర పలు సినిమాల్లో నటించింది. ఈ సందర్భంగా నరేశ్ పరిచయం అయ్యాక ఆయనతో చనువుగా ఉంటూ వస్తోంది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలని ప్రముఖ రచయిత్రి ఫేస్ బుక్లో పోస్టు పెట్టడం ఆసక్తిగా మారింది. నరేశ్, పవిత్రల మధ్య అఫైర్ నిజమే. కానీ వీరి పెళ్లిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి వారి మాజీలతో విడాకులు తీసుకున్నాకే పెళ్లి అని అంటున్నారు. కానీ ఇంతలోనే పెళ్లి అంటూ వార్తలు వచ్చినా నరేశ్, పవిత్రలు మాత్రం నోరు విప్పడం లేదు. ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లు వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నా వారి మాజీలతో విడాకులు తీసుకునేదెప్పుడు..? అని కొందరు చర్చించుకుంటున్నారు. మరో విషయమేంటంటే.. నరేశ్ తన మూడో భార్యకు ఎంత భరణం ఇచ్చి విడాకులు తీసుకుంటారు అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
Also Read:Pokiri Movie: పోకిరిని మిస్ చేసుకున్న ఆ స్టార్ ఎవరు?
Recommended Videos



[…] […]
[…] […]
[…] […]