https://oktelugu.com/

ఉద్యోగులకు ఝలక్.. హెల్త్ స్కీమ్ లో ఇచ్చేది లక్షే?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా చికిత్స చేయించుకుంటే తిరిగి గరిష్టంగా లక్ష రూపాయలు మాత్రమే మంజూరవుతోంది. కేవలం 10 రకాల జబ్బులకు మాత్రమే గరిష్టంగా 2 లక్షల రూపాయలు మంజూరవుతోంది. 13 సంవత్సరాల క్రితం నాటి ఉత్తర్వులే ఇప్పటికీ అమలవుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారు. ఎక్కువ మొత్తం బిల్లుకు తక్కువ మొత్తం మంజూరు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాకు చెందిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 4, 2021 / 09:26 AM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా చికిత్స చేయించుకుంటే తిరిగి గరిష్టంగా లక్ష రూపాయలు మాత్రమే మంజూరవుతోంది. కేవలం 10 రకాల జబ్బులకు మాత్రమే గరిష్టంగా 2 లక్షల రూపాయలు మంజూరవుతోంది. 13 సంవత్సరాల క్రితం నాటి ఉత్తర్వులే ఇప్పటికీ అమలవుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారు. ఎక్కువ మొత్తం బిల్లుకు తక్కువ మొత్తం మంజూరు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

    కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. అప్పటికే ఆస్తమాతో బాధ పడుతున్న ఆ వ్యక్తి ఉద్యోగుల ఆరోగ్య కార్డు చెల్లుబాటు కాకపోవడంతో ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకున్నాడు. 20 రోజుల తర్వాత కోలుకున్న ఆ వ్యక్తికి ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలైంది. చికిత్స కోసం ఉద్యోగులు ఖర్చు చేసే మొత్తానికి ప్రభుత్వం నుంచి అందే మొత్తానికి ఏ మాత్రం సంబంధం లేకపోవడం గమనార్హం.

    రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తుండగా ఈ పథకానికి నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో కార్పొరేట్ ఆస్పత్రులు ఉద్యోగుల ఆరోగ్య కార్డులను తిరస్కరిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వైద్యబిల్లుల తిరిగి చెల్లింపు పథకాన్ని కూడా అమలు చేస్తోంది. బిల్లులు తిరిగి పొందాలంటే ఉద్యోగులు తమ శాఖ కార్యాలయంలోనే వాటిని సమర్పించాలి.

    అయితే చెల్లించిన మొత్తంపై అసంతృప్తి ఉంటే ఉద్యోగులు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకున్న తరువాత సంవత్సరమైనా మంజూరు కాని బిల్లులు కూడా ఉన్నాయని సమాచారం. ఎంత కష్టపడినా చివరకు లక్ష రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుండటంతో నిబంధనల్లో మార్పులు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.