https://oktelugu.com/

Gorantla Madhav : చంద్రబాబు చస్తాడు.. గోరంట్ల మాధవ్ మరో దుమారం

అందుకే మాధవ్ ఈ విధంగా వ్యవహరించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Written By: , Updated On : October 29, 2023 / 10:45 AM IST
Follow us on

Gorantla Madhav : వైసీపీకి మేలు చేస్తున్నారో? అధినేత ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారో? తెలియడం లేదు కానీ.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు మీద తప్పు చేస్తున్నారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లి వివాదాస్పదుడిగా మారుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. అవినీతి కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న చంద్రబాబు తన చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు. తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఏకంగా న్యాయమూర్తికి లేఖ రాశారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు చస్తారు అన్న కామెంట్స్ తో గోరంట్ల మాధవ్ ప్రత్యర్థులకు టార్గెట్ గా మారారు.

అయితే పూర్వాశ్రమంలో పోలీస్ అధికారైన మాధవ్ పొలిటికల్ ఎంట్రీ అనూహ్యం. టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని సీఐ గా ఉన్న మాధవ్ సవాల్ చేశారు. వైసిపి హై కమాండ్ మనసును దోచారు. అదే జోరుతో హిందూపురం ఎంపీ సీటును దక్కించుకున్నారు. మంచి మెజారిటీతో గెలుపు సాధించారు. కానీ ఎంపీగా మారిన తరువాత అనేక వివాదాలను తెచ్చుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి డ్యామేజ్ చేశారు. గత ఏడాది అయితే ఆయన న్యూడ్ వీడియోతో అడ్డంగా బుక్ అయ్యారు. అది రచ్చ రంబోలాగా మారడంతో ఒక సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరోసారి వివాదాసుపత్రిక మారారు.

అనంతపురం జిల్లాలో కియో కార్ల కర్మాగారం ఫంక్షన్ లో కూడా ఆర్భాటం చేసి.. యాజమాన్యం మీద చిందులేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్రలో సైతం తనదైన శైలిలో విమర్శలు చేసి వివాదాస్పదుడిగా మారారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు జగన్ మరోసారి అధికారంలోకి వస్తాడు అని చెప్పుకోవడం తప్పులేదు. చంద్రబాబు ఎందుకు గెలవడో వివరించడం కూడా తప్పు కాదు. కానీ ఏకంగా చంద్రబాబు చస్తాడు అంటూ వ్యాఖ్యానించడం సొంత పార్టీ శ్రేణులను విస్మయ పరుస్తోంది. హిందూపురం ఎంపీ సీటు ఈసారి దక్కదని తెలుసుకునే మాధవ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఎంపీ మాధవ్ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోరాడుతున్నాయి. చంద్రబాబును జైలులో అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని ప్రజల మధ్యకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మాధవ్ నోటి నుంచి చంద్రబాబు మాట రావడం గమనార్హం. ఇప్పుడు ఇదే అంశాన్ని టిడిపి హైలెట్ చేసుకోవడం ప్రారంభించింది. గతంలో మాధవ్ మూలంగానే పార్టీకి డ్యామేజ్ జరిగినట్లు వైసిపి భావిస్తోంది. కానీ మాధవ్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. ఒక విధంగా చెప్పాలంటే వైసిపిని ఇరకాటంలో పడేలా మాధవ్ కామెంట్స్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంపీ మాధవ్ ఇక మారడా అన్న ప్రశ్న వైసీపీలోనే తలెత్తుతోంది. అయితే చంద్రబాబును ఎంతలా తిడితే.. వైసీపీలో అధినేత అంతలా గుర్తిస్తారని ప్రచారం ఉంది. అందుకే మాధవ్ ఈ విధంగా వ్యవహరించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.