Gorantla Madhav: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఏపీలో ఉన్న ఎంపీలు కంటే పాపులర్ అయ్యారు ఆయన. రాజకీయ అరంగేట్రమే ఓ సంచలనం. అనంతపురంలో నాటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని సవాల్ చేశారు. నాలుక కోస్తా అంటూ హెచ్చరించి జగన్ దృష్టిలో పడ్డారు. సీఐగా ఉన్న ఆయనతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించి వైసీపీలో చేర్పించారు. హిందూపురం ఎంపీ టికెట్ ను చేతిలో పెట్టారు. జగన్ ఆలోచనకు తగ్గట్టు మాధవ్ ఎంపీ అయ్యారు. అప్పటివరకు మాధవ్ కు పనికొచ్చిన దూకుడు.. అధికారంలోకి వచ్చాక కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు రాజకీయంగాను సైతం ప్రభావం చూపుతోంది.
ఉమ్మడి అనంతపురంలో వైసీపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. 2019లో మాత్రం స్వీప్ చేసినంత పని చేసింది. ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఎదురు దెబ్బతప్పదని సర్వే నివేదికలు తేల్చుతున్నాయి. దీంతో ఏపీ సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ మార్పు అనివార్యంగా తేలుతోంది.
ఎంపీగా గెలిచిన గోరంట్ల మాధవ్ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. ముఖ్యంగా న్యూడ్ కాల్ మాధవ్ కు వ్యక్తిగతంగా నష్టం కలిగించింది. అటు పార్టీ సైతం నవ్వుల పాలయ్యింది. అయితే వెను వెంటనే మాధవ్ పై చర్యలు తీసుకుంటే విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని జగన్ మాధవ్ ను కొనసాగించారు. మాధవ్ ను మరోసారి ఎంపీగా పోటీ చేయిస్తే నష్టం తప్పదని నివేదికలు వచ్చినట్లు సమాచారం. అందుకే మాధవ్ ను పక్కన పెడతారని టాక్ నడుస్తోంది. మరో నియోజకవర్గానికి మార్చుతారని ప్రచారం జరిగినా.. అటువంటిదేమీ లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మాధవ్ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతను తెరపైకి తెచ్చే పనిలో జగన్ ఉన్నట్లు సమాచారం. మొత్తానికైతే గోరంట్ల మాధవ్ ఎంత దూకుడుగా రాజకీయాల్లోకి వచ్చారు.. ఎంత దూకుడుగా ఎంపీ పదవి దక్కించుకున్నారో.. అంతే వేగంగా తెరమరుగు అవ్వడం ఖాయమని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.