Pawan Kalyan Convoy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయదశమి నుంచి ప్రజల మధ్యకు రానున్నారు. కీలక యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఆయన పర్యటన కొనసాగనుంది. అందుకే ఆయన తన పెండింగ్ సినిమాలు పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు. వీలైనంత త్వరగా సినిమాలు పూర్తిచేసి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నారు. యాత్రకు సంబంధించి అన్ని సన్నాహాలు పూర్తిచేస్తున్నారు. పక్కాగా ప్లాన్ చేసుకుంటన్నారు. రూట్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో జనసేన నాయకులు ఉన్నారు. ఆయన యాత్ర తిరుపతి నుంచి ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. పవన్ తిరుపతి నురంచి పోటీచేస్తారన్న ఊహాగానాలతో పాటు తమ కుటుంబానికి సెంటిమెంట్ గా ఉన్న వేంకటేశ్వరుడి సన్నిధి అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

తిరుపతి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. కొద్దిరోజుల్లో కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశముంది. కానీ అంతకంటే ముందుగానే యాత్రకు సంబంధించి షరంజామా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు పవన్. ప్రధానంగా కాన్వాయ్ ను సమకూర్చుకుంటున్నారు. కొత్త కాన్వాయ్ ను సిద్ధం చేసుకున్నారు. ఇందుకుగాను కొత్త స్కార్పియోలను కొనుగోలు చేశారు.ఈ కొత్త కార్ల కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. ఒక్కో కారు విలువ దాదాపుగా 19 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ అత్యాధునిక కార్ల కాన్వాయ్ ను చూస్తే గూస్ బాంబ్స్ గ్యారెంటీ అంటున్నారు.

జనసేన పార్టీ కోసం పవన్ ఈ కార్లను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. అధినేత ఇకపై జనంలోకి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా పవన్ ను సీఎం చేస్తామనే షరతుకు ఓకే చెబితే మాత్రమే పవన్ టీడీపీకి సపోర్ట్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.