Google : అమెరికా ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు ప్రముఖ సంస్థ గూగుల్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశాయి. డిజిటల్ ప్రకటనల మార్కెట్‌లో గూగుల్ గుత్తాధిపత్యాన్ని (Monopoly) ఏర్పరచుకుందని అమెరికా ఆరోపిస్తుంది. అంతేకాకుండా, గూగుల్ తన యాడ్ సర్వీసులను దుర్వినియోగం చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. వాషింగ్టన్ కోర్టు గూగుల్‌పై వచ్చిన ఈ ఆరోపణలను నిజమని నిర్ధారించింది. దీని ఫలితంగా గూగుల్ తన యాడ్ మేనేజర్‌ను విక్రయించవలసి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read : భారత్‌ను తాకిన గూగుల్ లేఆఫ్స్.. టెక్ రంగంలో ఆందోళన!
గూగుల్‌పై ఉన్న ఆరోపణలు ఏమిటి?
అమెరికా ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు ఇతర కంపెనీలను వెనక్కి నెట్టి గూగుల్ లాభం పొందిందని ఆరోపించాయి. అంతేకాకుండా, ప్రకటనదారులకు తక్కువ ఆఫ్షన్లను ఇచ్చిందని కూడా గూగుల్ మీద ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల పోటీ తగ్గిపోతోందని..ప్రకటన ధరలు కూడా పెరుగుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కోర్టులో గూగుల్ ఓడిపోతే అది తన కొన్ని సర్వీసులను అమ్మాల్సి ఉంటుంది. ముఖ్యంగా గూగుల్ యాడ్ మేనేజర్ ఇందులో ఉంటుంది. అంటే ప్రకటనలను అమ్మే, కొనే విభాగం. దీని ప్రభావం మొత్తం డిజిటల్ ప్రకటనల ఇండస్ట్రీ పై కనిపిస్తుంది. గూగుల్ నిజంగా తన యాడ్ టెక్ యూనిట్‌ను విక్రయించవలసి వస్తే, అది కంపెనీ వ్యాపార నమూనాను పూర్తిగా మారుస్తుంది.
అయితే, ప్రస్తుతం గూగుల్ తన వాదనను అమెరికా సుప్రీంకోర్టులో వినిపించే అవకాశం ఉంది. గూగుల్‌పై ఇటువంటి ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక దేశాలలో గూగుల్‌పై జరిమానాలు విధించారు.
గూగుల్ వాదన ఏమిటి?
గూగుల్ ఈ ఆరోపణలను ఖండించింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని వాదించింది. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులకు, ప్రకటనదారులకు లాభం చేకూరిందని గూగుల్ పేర్కొంది. ఈ కేసు ఆవిష్కరణలను అడ్డుకునే ప్రయత్నంగా చెప్పుకొచ్చింది. గూగుల్ నుండి యాడ్ మేనేజర్‌ను విక్రయిస్తే.. Gmail, Maps, Search ద్వారా చూసే గూగుల్ ప్రకటనలు తగ్గుతాయి.
గూగుల్ ఆదాయంపై ప్రభావం
Gmail, Maps, Search ద్వారా గూగుల్ ఆన్‌లైన్ ప్రకటనలను ప్రోత్సహిస్తుంది. నివేదికల ప్రకారం, 2024లో ఆల్ఫాబెట్ మొత్తం ఆదాయం 350 బిలియన్ డాలర్లు. ఇందులో దాదాపు 75 శాతం ప్రకటనల ద్వారానే వచ్చింది. కాబట్టి, యాడ్ మేనేజర్‌ను గూగుల్ నుండి వేరు చేస్తే దాని ఆదాయంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
Also Read : గూగుల్ ఆధిపత్యానికి చెక్.. సీసీఐ కీలక నిర్ణయం..