Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీGoogle : గూగుల్‌ ఆధిపత్యానికి చెక్‌.. సీసీఐ కీలక నిర్ణయం..

Google : గూగుల్‌ ఆధిపత్యానికి చెక్‌.. సీసీఐ కీలక నిర్ణయం..

Google  : గూగుల్‌ టీవీ మార్కెట్‌లో భారత్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే గూగుల్‌ అనుసరిస్తున్న యాంటీ కాంపిటీటివ్‌ విధనాలతో దేశీయ కంపెనీలకు నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గూగుల్‌(Google) తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (OS), ప్లే స్టోర్‌ను స్మార్ట్‌ టీవీలలో డిఫాల్ట్‌(Defalt)గా అందించే పద్ధతిని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ కేసు దాదాపు ముగింపు దశకు చేరుకోగా, గూగుల్‌ సెటిల్‌మెంట్‌(Google Settilment) ప్రతిపాదనను సమర్పించింది.

Also Read : భారత్‌ను తాకిన గూగుల్‌ లేఆఫ్స్‌.. టెక్‌ రంగంలో ఆందోళన!

గూగుల్‌ ఆధిపత్య దుర్వినియోగం
గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ భారత స్మార్ట్‌ టీవీ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం యాంటీ–కాంపిటీటివ్‌ పద్ధతులను అవలంబిస్తోందని CCI గుర్తించింది. గూగుల్‌(Google) రూపొందించిన ’టెలివిజన్‌ యాప్‌ డిస్ట్రిబ్యూషన్‌ అగ్రిమెంట్‌’ ద్వారా ఆండ్రాయిడ్‌ OS , ప్లే స్టోర్(Play Store), ఇతర గూగుల్‌ యాప్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్‌(Install) చేయడం తప్పనిసరి చేయడం ద్వారా గూగుల్‌ తన మార్కెట్‌ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని CCI విచారణలో తేలింది. ఈ విధానం ప్రత్యామ్నాయ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల అభివద్ధికి అడ్డంకులు సష్టిస్తోందని ఆరోపణలు వచ్చాయి.

భారతీయ న్యాయవాదుల ఫిర్యాదు
ఇద్దరు భారతీయ యాంటీ–ట్రస్ట్‌ న్యాయవాదులు గూగుల్, ఆల్ఫాబెట్‌(Alfabet)పై ఫిర్యాదు చేయడంతో CCI ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. గూగుల్‌ విధానాలు చిన్న సంస్థలు ప్రత్యామ్నాయ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను లేదా ఆండ్రాయిడ్‌ ఆధారిత సవరించిన వెర్షన్‌లను అభివృద్ధి చేయడానికి అడ్డంకులు కల్పిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

కొత్త లైసెన్సింగ్‌ విధానం
CCI ఆదేశాలను అనుసరించి, గూగుల్‌ ఒక సెటిల్‌మెంట్‌ అప్లికేషన్‌ను దాఖలు చేయడానికి అంగీకరించింది. ఇందులో భాగంగా, భారతదేశంలో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీల కోసం ప్లే స్టోర్‌, ప్లే సర్వీస్‌లను ఒకే ప్యాకేజీగా కాకుండా విడిగా లైసెన్స్‌(Lisence) చేయాలని ప్రతిపాదించింది. కొత్త ఒప్పందం ప్రకారం, గూగుల్‌ యాప్‌ల ప్రీ–ఇన్‌స్టాలేషన్‌(Pre Instalation) కోసం లైసెన్స్‌ ఫీజు విధించే అవకాశం ఉంది, ఇది గతంలో ఉచితంగా అందించబడేది.

స్మార్ట్‌ టీవీ తయారీదారులకు స్వేచ్ఛ
ఇఇఐ ఆదేశాల మేరకు, గూగుల్‌ తన ఆండ్రాయిడ్‌ టీవీ భాగస్వాములకు లేఖ ద్వారా స్పష్టమైన సమాచారాన్ని అందించాలని నిర్దేశించింది. ఇకపై స్మార్ట్‌ టీవీ తయారీదారులు గూగుల్‌ ఆండ్రాయిడ్‌ OS ను తప్పనిసరిగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. వారు తమకు నచ్చిన ఓపెన్‌–సోర్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను ఎంచుకోవచ్చు. ఈ నిర్ణయం స్మార్ట్‌ టీవీ తయారీదారులకు, ఇతర యాప్‌ స్టోర్‌లకు కొత్త అవకాశాలను తెరుస్తుంది.

వినియోగదారులపై ప్రభావం
ఈ మార్పులతో ఆండ్రాయిడ్‌ టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులు తాము ఎంచుకున్న టీవీలలో ఏ ఆపరేటింగ్‌ సిస్టమ్(Oparetiong System), యాప్‌ స్టోర్‌లు ఇన్‌స్టాల్‌ అయి ఉన్నాయో రిటైలర్లు లేదా బ్రాండ్‌లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతర ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు, యాప్‌ స్టోర్‌లు (అమెజాన్‌ యాప్‌ స్టోర్‌ వంటివి) స్మార్ట్‌ టీవీ(Smart TV) తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది, ఇది వినియోగదారులకు ఎక్కువ ఎంపికలను అందిస్తుంది.

యాప్‌ స్టోర్‌ల పోటీ
ప్రస్తుతం, గూగుల్‌ ప్లే స్టోర్, అమెజాన్‌ యాప్‌ స్టోర్, మరియు యాపిల్‌ స్టోర్‌లు స్మార్ట్‌ టీవీ వినియోగదారులకు విస్తత శ్రేణి యాప్‌లను అందిస్తున్నాయి. అయితే, అన్ని యాప్‌ స్టోర్‌లలో అన్ని యాప్‌లు అందుబాటులో ఉండవు. ఈ కొత్త నిర్ణయంతో, ఇతర యాప్‌ స్టోర్‌లు మరియు ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు మార్కెట్‌లో పోటీ పెంచే అవకాశం ఉంది.

జరిమానా, భవిష్యత్‌ ప్రభావం
సెటిల్‌మెంట్‌ ఒప్పందంలో భాగంగా, గూగుల్‌ రూ.20 కోట్లు (సుమారు 2.38 మిలియన్‌ డాలర్లు) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిర్ణయం స్మార్ట్‌ టీవీలకు మాత్రమే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో ఇతర పరికరాలకు కూడా ఈ విధానం విస్తరించే అవకాశం ఉందని CCI సూచించింది. ఈ నిర్ణయం భారత మార్కెట్‌లో టెక్‌ కంపెనీల ఆధిపత్యాన్ని నియంత్రించడంలో ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది.

CCI ఆదేశాలతో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ టీవీ విధానాలలో కీలక మార్పులు చేయనుంది. స్మార్ట్‌ టీవీ తయారీదారులకు ఎక్కువ స్వేచ్ఛ, వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు అందించే ఈ నిర్ణయం భారత స్మార్ట్‌ టీవీ మార్కెట్‌లో పోటీని మరింత పెంచనుంది.

Also Read : గ్రామీణ డాక్‌ సేవక్‌ ఫలితాలు.. రెండో జాబితా విడుదల

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version