Google AI : గూగుల్ త్వరలో తన ఏఐ చాట్‌బాట్ జెమినిని చిన్న పిల్లల కోసం కూడా అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతుంది. ఇటీవల కంపెనీ అమెరికాలో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్‌లో ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించవచ్చని ప్రకటించింది.
Also Read : సుందర్ పిచాయ్‌కు ‘జెమినీ’ గండం.. దిగిపోతారా?
పిల్లల కోసం జెమినిని గూగుల్ నిఘా(Google surveillance), పేరెంటల్ కంట్రోల్ వంటి టూల్స్‌తో లాంచ్ చేస్తుందని మార్చిలో తెలిపింది. ఇప్పుడు ఒక రిపోర్ట్ ప్రకారం గూగుల్ పిల్లల తల్లిదండ్రులకు ఈ ఫీచర్ గురించి తెలియజేస్తూ ఇమెయిల్‌లు పంపడం ప్రారంభించింది. జెమినిని పిల్లలు హోమ్‌వర్క్ చేయడానికి, ప్రశ్నలు అడగడానికి, కథలు రాయడానికి దీనిని ఉపయోగించగలరు. లాంచ్ తర్వాత ఈ చాట్‌బాట్ మొబైల్ యాప్‌లు, వెబ్ ప్లాట్‌ఫామ్‌లు రెండింటిలోనూ అందుబాటులోకి రానుంది. పిల్లలు కావాలంటే దీన్ని వారి ఆండ్రాయిడ్ డివైస్ డిఫాల్ట్ అసిస్టెంట్‌గా కూడా మార్చుకోవచ్చని పేర్కొన్నది.
అయితే జెమిని నుంచి వచ్చే సమాచారం పూర్తిగా కచ్చితమైనది కాకపోవచ్చని గూగుల్ ఇమెయిల్‌లో స్పష్టం చేసింది. కాబట్టి పిల్లలు ఏదైనా సమాచారాన్ని ఉపయోగించే ముందు దానిని మళ్లీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. జెమిని మనిషి కాదని, అది కేవలం మన మాటలను ఫాలో అవుతుంది కానీ ఆలోచించే సామర్థ్యం దానికి లేదని తెలిపింది.
జెమినిని ఉపయోగించే పిల్లలను వారి తల్లిదండ్రులు, పాఠశాలల మేనేజ్ మెంట్ పర్యవేక్షించవచ్చచు. ఒకవేళ పిల్లవాడు పాఠశాల ఖాతాతో లాగిన్ అయితే అడ్మిన్ Google Admin Console ద్వారా అతని యాక్టివిటీని గమనించవచ్చు. అదే సమయంలో తల్లిదండ్రులకు Family Link యాప్ ద్వారా వారి పిల్లల Google అకౌంట్, జెమిని యాక్సెస్‌ను మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా పిల్లవాడు ఎప్పుడు, ఎలా జెమినిని ఉపయోగిస్తున్నాడో కూడా తెలుసుకోవచ్చు.
Also Read : గూగుల్ మ్యాప్స్ లో జనరేటివ్ ఏఐ.. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందంటే..