YSR Cheyutha Scheme: చేతికి ఎముకే లేనట్టుగా జగన్ సర్కార్ ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో నిధులు కుమ్మరిస్తోంది. క్యాలెండర్ పెట్టుకొని మరీ వారి ఖాతాల్లో డబ్బులు వేస్తోంది. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడానికి సిద్ధమైంది.

ఈ పథకానికి 45 ఏళ్లు నిండి అర్హులైన వారి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేర్లు నమోదుతోపాటు దరఖాస్తులను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకూ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాలలో 45-60 ఏళ్ల మధ్య వయసు ఉండే అర్హుతలకు రాష్ట్రప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా రూ.18750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తోంది. సెప్టెంబర్ 5 వరకూ కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూూచించింది.
Also Read: Twitter- IRCTC: ట్విట్టర్, ఐఆర్.సీ.టీసీకి షాకిచ్చిన పార్లమెంటరీ ప్యానెల్..

సెప్టెంబర్ 8లోగా సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు. అలాగే కొత్తగా పేర్ల నమోదు ప్రక్రియకు కుల ధ్రువీకరణ పత్రంతోపాటు ఆదాయ ద్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరి గా జతచేయాలి.
పూర్తయ్యాక మూడోవిడతలో సెప్టెంబర్ లోనే లబ్ధిదారులకు రూ.18750 చొప్పున ప్రభుత్వం వారి అకౌంట్ లలో డబ్బును జమ చేస్తుంది. అర్హులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి.
Also Read:Team India New Jersey- Asia Cup 2022: ఆసియా కప్ కోసం కొత్త జెర్సీతో టీమిండియా.. అదిరిపోలా..