spot_img
Homeజాతీయ వార్తలుGovernment Bank : 18ఏళ్లు నిండిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1 కట్టకుండానే ట్రైనింగుతో...

Government Bank : 18ఏళ్లు నిండిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1 కట్టకుండానే ట్రైనింగుతో పాటు ఉద్యోగం కూడా

Government Bank : పది పాసై ఇంటి దగ్గర ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నారా. ఉద్యోగం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారా. అలాంటి వారికో గుడ్ న్యూస్. ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రామీణ నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం లభించబోతోంది. ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నవారు, ఉపాధి కోసం ఎదురుచూస్తున్నవారికి కెనరా బ్యాంక్ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కర్నూలు జిల్లా కల్లూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు.

ఉచిత శిక్షణలో ఏమేం ఉంటాయి?
గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు ఉచితంగా వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కెనరా బ్యాంక్ కల్లూరు బ్రాంచ్ మేనేజర్ కె. పుష్పక్ కుమార్ వెల్లడించారు. ఈ శిక్షణ శిబిరంలో మహిళలకు కుట్టుమిషన్, మగ్గం వర్క్, కంప్యూటర్ డేటా ఎంట్రీ వంటి కోర్సులు అందిస్తారు. అదే విధంగా, పురుషులకు మొబైల్ రిపేర్, బైక్ మెకానిక్, సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్, సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ తదితర శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అంతేకాకుండా, లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ శిక్షణను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఇది మొదటిసారి అమలు చేయబోతున్న ప్రోగ్రామ్.

శిక్షణ శిబిరం ప్రత్యేకతలు
ఈ శిక్షణ శిబిరంలో అభ్యర్థులకు ఉచితంగా వసతి, భోజన సదుపాయం అందజేస్తారు. డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి గుర్తింపు సర్టిఫికెట్, సంపూర్ణ ఉచిత శిక్షణ, నైపుణ్యాలను మెరుగుపరచుకుని ఉపాధి అవకాశాలను పొందే అవకాశం కల్పిస్తారు.

ఎవరెవరు అర్హులు?
18 నుండి 45 ఏళ్ల లోపు వారు ఈ శిక్షణకు అర్హులు. తెలుగులో చదవడం రాయడం వచ్చి ఉండాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులు అయి ఉండాలి.

ఎప్పుడు ప్రారంభం?
ఈ నెల 24వ తేదీ నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. కెనరా బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చేసుకునేందుకు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, విద్యార్హత పత్రాల జిరాక్స్ అవసరం అవుతాయి. మరిన్ని వివరాల కోసం 6304491236, 8500677585 సంప్రదించాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version