https://oktelugu.com/

టీకాపై దేశ ప్రజలకు శుభవార్త

కరోనా మొదటి వేవ్ లోనే దేశంలో టీకాలు వేసే కార్యక్రమం మొదలైంది. అయితే నాడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఏం తమకేం కాదులే అని లైట్ తీసుకున్నారు. తీరా రెండో వేవ్ వచ్చి దేశాన్ని అల్లకల్లోలం చేసింది. వేల మందిని చంపి.. లక్షల మంది ప్రాణాలు తీసింది. దీంతో వ్యాక్సిన్ల కోసం జనాలు హాహాకారాలు చేసింది. అయితే పుణ్యకాలం కాస్త ముగిసి టీకాల కొరత ఏర్పడింది. డిమాండ్ కు సరిపడా వేయలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మళ్లీ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 16, 2021 / 02:17 PM IST
    Follow us on

    కరోనా మొదటి వేవ్ లోనే దేశంలో టీకాలు వేసే కార్యక్రమం మొదలైంది. అయితే నాడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఏం తమకేం కాదులే అని లైట్ తీసుకున్నారు. తీరా రెండో వేవ్ వచ్చి దేశాన్ని అల్లకల్లోలం చేసింది. వేల మందిని చంపి.. లక్షల మంది ప్రాణాలు తీసింది. దీంతో వ్యాక్సిన్ల కోసం జనాలు హాహాకారాలు చేసింది. అయితే పుణ్యకాలం కాస్త ముగిసి టీకాల కొరత ఏర్పడింది. డిమాండ్ కు సరిపడా వేయలేని దుస్థితి నెలకొంది.

    ప్రస్తుతం మళ్లీ టీకా వ్యాక్సినేషన్ ఊపందుకుంది. వ్యాక్సిన్ల లభ్యత పెరిగింది. అందరికీ కేంద్రమే ఉచితంగా టీకా వేయిస్తోంది. అయితే ఇంటర్నెట్ లో రిజిస్ట్రేషన్ అంటూ, ఆధార్ కార్డ్ అవసరం అంటూ ముందస్తు నిబంధనలు పెట్టడంతో గ్రామీణులు, పట్టణాల్లోని పేదలు ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి దూరం అవుతున్నారు. ఇక బడాబాబులు కూడా ఈ తతంగం అంతా ఏంటని వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం లేదు.

    దీంతో దెబ్బకు కేంద్రప్రభుత్వం కూడా వ్యాక్సిన్ ప్రక్రయలో ఇబ్బందులను గుర్తించి తొలగించింది. దేశ ప్రజలకు టీకా విషయంలో పెద్ద ఇబ్బందిని పరిష్కరించింది.

    తాజాగా కేంద్రప్రభుత్వం టీకాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే టీకా వేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గాన్ని సులభతరం చేసింది. అంతేకాదు.. టీకా వేయించుకునేందుకు ఎలాంటి అపాయింట్ మెంట్ లేదని తేల్చిచెప్పింది.

    కేంద్రప్రభుత్వ తాజా నిర్ణయంతో టీకా వేయించుకోవాలనుకునే వారికి గొప్పఊరట లభించింది.టీకా వేయించుకోవడం కంటే.. దాని కోసం రిజిస్ట్రేషన్, అపాయింట్ మెంట్ లాంటి వ్యయప్రయాసాలపైనే జనం విసిగి దూరమయ్యారు. ఇప్పుడు ఈ తలనొప్పులు తగ్గడంతో జనాలు టీకాలు వేసుకునేందుకు ముందుకు రానున్నారు.

    ఇక నుంచి 18 ఏళ్లు దాటిన వారు నేరుగా సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవచ్చని కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 1075 హెల్ప్ లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని పేర్కొంది. వ్యాక్సిన్ వేసేవారు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసి టీకా వేస్తారని కేంద్రం తెలిపింది. దీని వల్ల గ్రామీణ ప్రజలు, పట్టణాల్లోని చదువురాని పేదలు, ఈజీగా టీకాలు వేసుకునేందుకు అవకాశం చిక్కింది.