Indian Railways : భారతదేశంలో అతిపెద్ద రవాణా మార్గం రైలు ప్రయాణం. తక్కువ ధరల్లో ఎక్కువ దూరం ప్రయాణించడానికి రైలు మార్గం అనువైనది. దేశంలో ప్రతిరోజు కోట్లమంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తుంటారు వీరిలో కొందరు విహారయాత్రలకు వెళ్లేవారు ఉండగా.. మరికొందరు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ప్రయాణం చేసేవారు ఉన్నారు. అయితే చాలామంది రైలు ప్రయాణం చేసే సమయంలో ఎదురయ్యే ప్రధాన అనుభవం ట్రైన్ సమయానికి రాకపోవడం. చాలా సందర్భాల్లో రైలు ఆలస్యంగా వచ్చిన సంఘటనలు ఉన్నాయి వీటికి కారణాలు ఏవైనా కావచ్చు కానీ సమయానికి ట్రైన్ రాకపోవడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి . అయితే ఈ ఇబ్బంది నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు రైల్వే బోర్డు కొత్త ప్రయోగాన్ని చేస్తుంది అది ఏంటంటే?
కాలం మారుతున్న కొద్ది రైల్వే శాఖ కొత్త కొత్త ప్రణాళికలను చేపడుతుంది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైన వాటి పరిష్కారానికి కొత్త పథకాలను చేపడుతుంది తాజాగా రైలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులకు ఏర్పడే ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఫుడ్ సౌకర్యాన్ని కల్పించనుంది. రైలు ఎక్కువ గంటలు ఆలస్యంగా వస్తే ఆ రైళ్లలో ప్రయాణించే వారి కోసం ఉచితంగా అల్పాహారం లేదా భోజనం అందించే ఏర్పాట్లు చేస్తామని రైల్వే బోర్డు తెలిపింది ఐఆర్సిటిసి క్యాటరింగ్ పాలసీ కింద ఈ ఫుడ్ ను అందిస్తుంది
సాధారణంగా ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కువసేపు ఆలస్యంగా వస్తే ప్రయాణికుల కోసం ఆహారాన్ని అందిస్తారు. అదేవిధంగా రైలు లో ప్రయాణించే వారి కోసం కూడా ఈ సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ రైల్వే తెలిపింది. అయితే ఈ ఆహారం రైల్వేలో ప్రయాణించే వారి కోసమే అందివ్వనుంది. రైలు కోసం ఎదురుచూసే వారికి సమయాన్ని బట్టి ఆహారాన్ని అందిస్తారు మధ్యాహ్న సమయంలో అయితే సాచెట్లు, ఏడు పూరీలు కూరలు, మసాలాలు ఇస్తారు. సాయంత్రం సమయంలో షుగర్ లెస్, షుగర్ పానీయాలు, మిల్క్ క్రీమర్ తో పాటు టీ, కాఫీ అందిస్తారు. రాత్రి సమయంలో మధ్యాహ్నం అందించే వాటిని ఇస్తారు. వీటిలో ప్రయాణికులు తమకు కావలసినవి ఎంచుకోవచ్చు. మరోవైపు మూడు గంటల కంటే ఎక్కువగా ఆలస్యం అయితే పూర్తి చార్జీలు రిఫండ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం. తెలిసిందే. రైల్వే టికెట్ కౌంటర్ లో బుక్ చేసుకున్న వారు మాత్రం నగదు పొందేందుకు టికెట్ ను రద్దు చేసుకోవాలి .
ఇలా ఉండగా రైలు కోసం ఎదురుచూసే వారి కోసం వెయిటింగ్ రూమ్ లో అదనపు చార్జీలు వసూలు చేయరు. ఇలాంటి సందర్భాల్లో ఆహార దుకాణాలు సైతం ఎక్కువ గంటలు పనిచేస్తాయి. అలాగే ప్రయాణికుల భద్రత కోసం పోలీస్ స్టేషన్ నుంచి అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. మొత్తంగా రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురానున్నారు. ప్రయాణికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా.. వాటి పరిష్కారానికి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా రైలు ఆలస్యం సమస్యను ఎదుర్కొనేవారు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వెయిటింగ్ చార్జీలు కూడా లేకపోవడం మరింత ప్రయోజనాలు కలిగిస్తుందని కొందరు అంటున్నారు.