https://oktelugu.com/

Meenakshi Chaudhary: వరుస ఫ్లాప్స్ వస్తున్నా కూడా మీనాక్షి చౌదరీ కి ఆఫర్స్ వస్తున్నది ఆ యంగ్ హీరో వల్లనేనా..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్!

ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్స్ ఎంత తొందరగా అయితే సక్సెస్ అవుతున్నారో, అంతే తొందరగా ఒకటి రెండు ఫ్లాప్స్ రాగానే డౌన్ అయిపోతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 29, 2024 / 04:37 PM IST
    Follow us on

    Meenakshi Chaudhary: ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్స్ ఎంత తొందరగా అయితే సక్సెస్ అవుతున్నారో, అంతే తొందరగా ఒకటి రెండు ఫ్లాప్స్ రాగానే డౌన్ అయిపోతున్నారు. శ్రీలీల, కృతి శెట్టి వంటి వారు గడిచిన రెండు మూడేళ్ళలో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లకు ఇప్పుడు వరుసగా డిజాస్టర్స్ వచ్చేలోపు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అలాంటి పరిస్థితులు ఉన్న ఈరోజుల్లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా కెరీర్ లో చేతినిండా అవకాశాలను దక్కించుకుంటూ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈమె సుశాంత్ హీరో గా నటించిన ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. అలాంటి ఫ్లాప్ తర్వాత కూడా ఈమెకు అవకాశాలు క్యూలు కట్టాయి.

    ఈ సినిమా తర్వాత వెంటనే ఆమెకు మాస్ మహారాజ రవితేజ తో ‘ఖిలాడీ’ చిత్రం లో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ కూడా మీనాక్షి చౌదరి కి అవకాశాలు వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ఆమె అడవి శేష్ తో కలిసి ‘హిట్ : ది సెకండ్ కేస్’ అనే చిత్రంలో చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ ఏడాది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తలపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. వీటిలో గుంటూరు కారం పెద్ద ఫ్లాప్ కాగా, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఈ చిత్రం తర్వాత ఆమె ‘దుల్కర్ సల్మాన్’ తో కలిసి చేసిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.

    కానీ ఆ తర్వాత వచ్చిన ‘మట్కా’, ‘మెకానిక్ రాకీ’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అయినప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు తగ్గడం లేదు. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రం లో కూడా ఈమె ఒక హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత ఆమె నవీన్ పోలిశెట్టి తో కలిసి ‘అనగనగా ఒక రాజు’ అనే చిత్రం లో నటిస్తుంది. ఈ సినిమాలో ముందుగా శ్రీలీల ని తీసుకున్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆమెని తప్పించి మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు.ఇలా వరుసగా ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ కూడా ఈమెకి ఇన్ని అవకాశాలు రావడానికి ప్రధాన కారణం ఒక ప్రముఖ యంగ్ హీరో అని తెలుస్తుంది. ఆ యంగ్ హీరో తో గత కొంతకాలంగా ఈమె ప్రేమాయణం నడుపుతుందని, ప్రస్తుతం అతనితో ఒక సినిమా కూడా చేస్తుందని తెలుస్తుంది. అతని కారణంగానే ఈమెకి అవకాశాలు వస్తున్నాయట.