Daaku Maharaj: పవర్ చిత్రం తో ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా అడుగుపెట్టిన బాబీ, రెండవ సినిమాతోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకి దర్శకత్వం వహించే అవకాశం సంపాదించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా, తదుపరి చిత్రం జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ కి పిలిచి మరీ దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది కానీ, డైరెక్టర్ బాబీ కంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ కి పేరొచ్చింది. ఇతర డైరెక్టర్స్ లాగా ఈయన పేరు ఇండస్ట్రీ లో మారుమోగిపోయే రేంజ్ క్రేజ్ రాలేదు. అయినప్పటికీ కూడా బాబీ కి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా తర్వాత ఆయన బాలయ్య తో తీసిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం పై అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ కూడా మన ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన డైరెక్టర్ బాబీ, ‘డాకు మహారాజ్’ చిత్రం గురించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా ప్రారంభం అయ్యే ముందు ఇందులో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడని ఒక ప్రచారం సోషల్ మీడియా లో జోరుగా సాగింది. సినిమా నుండి చాలా కంటెంట్ బయటకి వచ్చింది కానీ, దుల్కర్ సల్మాన్ క్యారక్టర్ కి సంబంధించిన కంటెంట్ బయటకి రావడం లేదు. అసలు ఈ సినిమాలో ఆయన ఉన్నాడా లేదా అని అభిమానులు సందేహించారు.
దీనికి బాబీ సమాధానం చెప్తూ ‘ ఇందులో దుల్కర్ సల్మాన్ ని ఒక ప్రముఖ పాత్ర కోసం తీసుకుందాం అనుకున్నాను. కానీ కథలో ఆయన పాత్రకి డిమాండ్ లేదు. కథ కి సంబంధం లేకుండా ఆయన క్యారక్టర్ ని ఈ సినిమాలో పెడితే , బలవంతంగా ఇరికించినట్టు ఉంటుంది, పైగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇద్దరు హీరోలను పెట్టి, మళ్ళీ తదుపరి చిత్రం లో అలాగే చేస్తే ఆడియన్స్ రొటీన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది, అందుకే సెకండ్ హీరో క్యారక్టర్ ని తీసేసాము’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బాబీ. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా రెండు రోజుల ముందు ఈ చిత్ర నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ ఇంటర్వెల్ కి ముందు 20 నిమిషాలు వేరే లెవెల్ లో ఉంటుందని, ఫ్యాన్స్ సీట్స్ మీద కూర్చారని చెప్పుకొచ్చాడు.