Gold Prices Today : మనదేశంలో మహిళలతోపాటు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న వాళ్లు కూడా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ఈ ఎడాది ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటి ఆల్ టైం హై రికార్డుకు చేరుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. పెళ్లిళ్లు, శుభకార్యాల నేపథ్యంలో మార్కెట్లో బంగారం కు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అయితే గత కొన్ని రోజుల నుంచి తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. లక్ష నుంచి తులం బంగారం ధర 95 వేలకు తగ్గి మళ్లీ పెరుగుతుంది. ప్రస్తుతం మన దేశ మార్కెట్లో తులం బంగారం ధర 99 వేలుగా ఉంది. బులియన్ మార్కెట్లో బంగారం హెచ్చుతగ్గులలో జరుగుతున్న మార్కులు మన దేశ మార్కెట్లో కూడా కనిపిస్తాయి. జూన్ 5, 2025 గురువారం రోజు ఉదయం పలు వెబ్సైట్లో నమోదైన ధరలను పరిశీలిస్తే స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి రేటు రూ.99,180, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.90,910 గా ఉంది. ఇక కిలో వెండి ధర మన దేశ మార్కెట్లో రూ.1,02,100 గా ఉంది.
మనదేశంలో ఉన్న ప్రధాన నగరాలు ముంబై, చెన్నై, బెంగళూరు మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి రేటు రూ.99,180, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.90,910, కిలో వెండి రేటు రూ.1,02,100 గా ఉన్నాయి.
ఇక ఢిల్లీ నగరం లో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి రేటు రూ.99,330, 22 క్యారెట్ల పసిడి రేటు రూ.91,060, కిలో వెండి రేటు రూ.1,02,100 గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.99,180, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.90,910, కిలో వెండి రేటు రూ.1,13,100 గా ఉన్నాయి.