Homeజాతీయ వార్తలుKumbh Mela : కుంభమేళకు వెళ్తున్నారా? అయితే ఈ ప్రాంతాలను కూడా చుట్టి రండి.

Kumbh Mela : కుంభమేళకు వెళ్తున్నారా? అయితే ఈ ప్రాంతాలను కూడా చుట్టి రండి.

Kumbh Mela : మహా కుంభమేళా 2025 జనవరి 13న ప్రారంభమవుతుంది. ఇదొక చారిత్రక, మతపరమైన కార్యక్రమం. ఈ మేళ ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సారి మహా కుంభమేళ జరగనుంది. అతి త్వరలో ఈ జాతర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కుంభస్నానం చేసేందుకు లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర ఫిబ్రవరి 26న ముగుస్తుంది. అయితే మీరు కూడా ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారా? అయితే ఖచ్చితంగా కొన్ని ప్రదేశాలను చూట్టి రండి. ప్రయాగ్‌రాజ్‌లోని జాతరకు దగ్గరగా ఉన్న ప్రదేశాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. వీటి వల్ల ఈ ట్రిప్ మీకు కచ్చితంగా గుర్తుండిపోతుంది.

త్రివేణి సంగమం
గంగా, యమునా, సరస్వతి అనే మూడు నదులు ప్రయాగ్‌రాజ్‌లోని అతి ముఖ్యమైన ధార్మిక ప్రదేశం అయిన త్రివేణి సంగమం వద్ద కలుస్తాయి. అయితే, ఇప్పుడు సరస్వతి నది అంతరించిపోయినట్లుగా చెబుతుంటారు. ఈ ప్రదేశం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే కుంభమేళా ప్రధాన ఆకర్షణ కూడా. నదుల సంగమ ప్రదేశాన్ని దగ్గరగా చూడటానికి ఇక్కడ పడవ ప్రయాణం కూడా అందుబాటులో ఉంది.

అలహాబాద్ కోట
అక్బర్ చక్రవర్తి ఈ కోటను 1583లో నిర్మించాడు. ఈ కోటలోని సరస్వతి బావి, పాటల్‌పురి ఆలయం, అశోక స్తంభాన్ని సందర్శించండి. కుంభమేళా సమయంలో ఈ కోట ప్రజలకు సగం తెరిచి ఉంటుంది.

హనుమాన్ దేవాలయం
హనుమంతుని శయన విగ్రహానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని కుంభం సమయంలో ఆశీర్వాదం, ఆధ్యాత్మిక అనుభూతి కోసం తప్పక సందర్శించాలి. ఇక్కడి విభిన్నమైన వాస్తుశిల్పం చూడదగ్గదిగా ఉంటుంది. మీరు మహాకుంభ స్నానం చేయడానికి వెళితే, తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి.

యమునా, సరస్వతి ఘాట్
ఈ ఘాట్‌లు కుంభమేళాలో భాగంగా ఉన్నాయి. పవిత్రమైన ఆచారాలు, నిర్మలమైన పడవ ప్రయాణాల కోసం ఈ స్థలాన్ని సందర్శించండి. మీరు ఇక్కడ ఆరతికి హాజరైతే మంచి థ్రిల్ అనిపిస్తుంది. ఆధ్యాత్మిక అనుభూతి కోసం పడవ ప్రయాణం చేయవచ్చు.

అశోక స్తంభం
అశోక స్థంభం మౌర్య చక్రవర్తి అశోకుడు స్థాపించిన చారిత్రక స్తంభం. ఈ స్తంభంపై అశోకుని మత శాసనాలు రాసి ఉన్నాయి. ఇది భారతీయ చరిత్రలో ఒక ప్రత్యేక భాగం. మీరు పిల్లలతో కలిసి ఈ ప్రదేశాన్ని చూడటానికి వెళ్లండి.

ఇంతకీ ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి ప్రతి రోజు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. అదే దానాపూర్ ఎక్స్‌ప్రెస్. సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ రైలు ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ అనే రెండు స్టేషన్లలో ఆగుతుంది. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 25 గంటల సమయం పడుతుంది. అయితే కుంభమేళా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1225 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular