Economic Recession: ఆడి పుట్టిన దేశం.. ప్రపంచ ఆటోమొబైల్ రాజధాని గా పేరు గడించిన దేశం జర్మనీ.. యూరప్ లో అత్యంత స్థితిమంతమైన దేశం.. కానీ ఇప్పుడు దాని ఆర్ధిక పరిస్థితి దిగజారింది.జర్మనీ దేశంలో 70 ఏళ్ల తరువాత తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కుంటున్నది. ప్రస్తుతం 7.9 % శాతం గా ఉంది. ముందు రోజుల్లో ఇంకా పెరగవచ్చని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహుశా రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఎదుర్కొన్న పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. యూరోప్ సమూహంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశం జర్మనీ. కానీ ఇక ముందు అలా ఉండక పోవచ్చు. రష్యా నుంచి సహజ వాయువు తో పాటు పెట్రోల్,డీజిల్ ని తక్కువ ధరకే కొనుగోలు చేసే యూరోప్ దేశాలలో జర్మనీ ప్రధమ స్థానంలో ఉంది. ఇప్పుడు రష్యా నుంచి గ్యాస్,చమురు సరఫరా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలకి రెక్కలు వచ్చాయి.

_ భారత్ ఏం తెలుసుకోవాలంటే
ఇన్నాళ్లూ చౌక ధరలో గ్యాస్,చమురు సరఫరా చేసుకుంటూ వచ్చిన యూరోప్ దేశాలు ఇప్పుడు చమురు ధరలు పెరగానే ఆందోళన చెందుతున్నాయి. ఆలెక్కన 130 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి దిగుమతి చేసుకునేందుకు ఎలాంటి గ్యాస్ పైప్ లైన్ లేదు.పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు జర్మన్ ఛాన్సలర్ ఒల్ఫ్ స్కాలోజ్ మాత్రం తక్షణం €200 బీ ఎన్ యూరోలని చమురు,గ్యాస్ సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇదే యూరోప్,అమెరికా దేశాలు భారత దేశానికి నీతులు చెప్పాయి. ఇప్పుడు వాళ్ల దాకా వస్తే కానీ అర్థం కాలేదు. “భారత ప్రభుత్వం వ్యవసాయ,చమురు,గ్యాస్ సబ్సిడీలని ఇవ్వడం మానేయాలి. ధరలు పెంచాలి. ఇలా అయితేనే ప్రపంచ బ్యాంక్ నుంచి లేదా యూరోపు దేశాల నుంచి అప్పు పుడుతుంది” అని ఆ దేశాధినేతలు వ్యాఖ్యానించే వారు. కానీ వారికి ఇప్పుడు నొప్పి తెలుస్తున్నది. జర్మనీ లో గత ఆగస్ట్ నెలలో నిత్యావసరాల ధరల పెరుగుదల 8.8% శాతంగా ఉంది. సెప్టెంబరు నెలకు వచ్చేసరికి 10.9% శాతానికి పెరిగిందని జర్మన్ ఫెడరల్ స్టాటిస్టీకల్ ఏజెన్సీ పేర్కొంది. అయితే ఇది ఇంకా పెరిగి డబుల్ డిజిట్ కి చేరుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. 1951 తరువాత ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడం ఇదే మొదటి సారి అని కూడా చెబుతున్నది.. అయితే ఈ ధరల పెరుగుదల కేవలం జర్మనీ కి పరిమితం అవుతుంది అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. మొత్తం యూరోప్ దేశాలలో ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ కి చేరుకునే ప్రమాదం ఉందని అని ఫెడరల్ స్టాస్టికల్ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేస్తున్నది. యూరోపియన్ సెంట్రల్ బాంక్ ఇప్పట్లో వడ్డీ రేట్లని పెంచే యోచనలో లేమని ప్రకటించింది. ఒకవేళ ఇందుకు విరుద్ధంగా జరిగితే ధరల సూచి నింగిని అంటడం ఖాయం.
Also Read: Adipurush Teaser: మరికొన్ని గంటల్లో ఆదిపురుష్ టీజర్… బయటికొస్తున్న సంచలన విషయాలు!
అదే సమయంలో రుణాల మీద వడ్డీ శాతం పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పడం అక్కడి ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇదే క్రమంలో భారత దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ శాతం తగ్గించే అవకాశం ఉంది. గత ఆరు నెలలుగా నెలకు 2.2 శా తం చొప్పున జర్మనీలో ధరలు పెరుగుతున్నాయి. ప్రజలు ఇంధనం ధరలను తట్టుకోవడానికి అంటూ నెలవారీ ట్రైన్ టికెట్ మీద 8 యూరోలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గత ఆగస్ట్ నెలలో ఇంధనం ధరల పెరుగుదల 36% శాతంగా ఉండగా సెప్టెంబర్ నెలలో అది 48%గా నమోదు అయ్యింది. ఆహార ధాన్యాలు వాటి ఉత్పత్తుల ధరల పెరుగుదల ఆగస్ట్ నెల కంటే రెట్టింపు అయ్యాయి.
_ఇదంతా రష్యా అధ్యక్షుడు పుతిన్ చావు దెబ్బ ఫలితం
మూడు రోజుల క్రితం రష్యా నుంచి జర్మనీ కి సహజవాయువు సరఫరా చేసే నొర్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ బాల్టిక్ సముద్రంలో పేలిపోయింది. గ్యాస్ సముద్ర పై భాగంలోకి చొచ్చుకొని వచ్చింది. ఇది నాటో దళాల పని అని పుతిన్ ఆరోపిస్తున్నాడు. కానీ అంతకు వారం ముందే అమెరికన్ సీఐఏ ఏ క్షణం లో అయినా సముద్రం అడుగున ఉన్న గ్యాస్ పైప్ లైన్ ని రష్యా పేల్చివేస్తుంది అంటూ ముందస్తుగా హెచ్చరించింది. మూడు రోజుల తరువాత పైప్ లైన్ పేలి పోయింది. ఇప్పుడు దాని పరిణామాలను జర్మనీ అనుభవిస్తున్నది. రష్యా_ యూరప్ దేశాల మధ్య వైరం ఇంతలా ముదిరిపోవడానికి కారణం లేకపోలేదు. ఆగస్ట్ నెలలో యూరోప్ నకు సహజవాయువు సరఫరా ను రష్యా పూర్తిగా నిలిపి వేసింది. నిర్వహణకు సంబంధించి మరమ్మతులు చేస్తున్నామని రష్యా అధ్యక్షుడు ప్రకటించారు. కానీ దాని వెనుక అంతరంగం వేరే ఉంది. రష్యా అధ్యక్షుడు ప్రకటించిన మూడు రోజులకే ఆ గ్యాస్ పైప్ లైన్ పేల్చివేతకు గురైంది. మానవతా దృక్పధంతో గ్యాస్ సరఫరా పునరుద్ధరించమని యూరప్ దేశాలకు అడిగే అవకాశం లేకుండా పుతిన్ చేశాడు . దీనివల్ల జర్మనీ లో చలికాలం ఇంటిని వెచ్చగా ఉంచడానికి కావాల్సిన గ్యాస్ మీద రేషన్ విధించింది ప్రభుత్వం. ఇలా చేసినా ఈ చలికాలం మొత్తానికి సరిపడా గ్యాస్ నిల్వలు లేవు. ఇన్నాళ్లు రష్యా సరఫరా చేసే గ్యాస్ మీద ఆధారపడిన ఆ దేశం.. ఇప్పుడు బేల చూపులు చూస్తోంది. నిజానికి జర్మనీ తో పాటు మరికొన్ని యూరోప్ దేశాలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు సహజవాయువు సరఫరా కోసం రష్యాతో ముందుగానే చెల్లింపులు చేసి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ వాటి డాలర్ల ని రష్యా ఫ్రీజ్ చేయడంతో అవి పనికిరాకుండా పోయాయి. నాటో మీద కోపంతో పుతిన్ అసలుకే గ్యాస్ సరఫరా ఆపేశాడు. ఇదే సమయంలో భారత కరెన్సీ లోనే సహజవాయువును రష్యా సరఫరా చేస్తుండడం నరేంద్ర మోడీ దౌత్య నీతికి నిదర్శనం.
_మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే
యూరోపు లో ఆయిల్ రిఫైనరీస్ లేవు, ఉండవు. అవి కాలుష్యాన్ని వెదజల్లుతాయి కాబట్టి వాళ్ళు రిఫైనరీస్ ని పెట్టరు. రష్యా నుంచి నేరుగా గ్యాస్,పెట్రోల్,డీజిల్ లని చాలా తక్కువ ధరకి దిగుమతి చేసుకునే వారం మన విదేశీ మారక ద్రవ్యం లో సింహా భాగం చమురుకే ఖర్చుపెట్టాల్సిన స్థితి. వాళ్ళకి అలాంటి ప్రమాదం ఏమీ లేదు కానీ ఇప్పుడు డాలర్ తో పోలిస్తే యూరో ధర పడిపోవడం,ఇంధనం,ఆహార ధరలు పెరగడంతో గగ్గోలుపెడుతున్నారు. కానీ మన దేశంతో పాటు ఆసియా దేశాలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి అంటూ ఉపన్యాసాలు చెప్తారు. జర్మనీ కార్లని ఉత్పత్తి చేసి అన్ని దేశాలకి ఎగుమతి చేస్తుంది. కానీ ఆ కార్లు మనం కొని కాలుష్యాన్ని వెదజల్లవచ్చు అన్నమాట !

చెడపకురా చెడేవు అంటే ఇదేనేమో! వాస్తవానికి డిసెంబర్,జనవరి నెలలు యూరప్ దేశాలకు చాలా కీలకం. ఆ సమయంలో చలిని తట్టుకోలేక ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తారని రష్యా అంటున్నది. . అలాగే ఎంతకాలం సబ్సిడీలు ఇస్తూ పోతారో చూడాలని పరిహసిస్తున్నది.
2023 లో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం వస్తుంది. ఇది తప్పదు. కానీ ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఓడలు బండ్లు,బండ్లు ఓడలు అయ్యే అవకాశాలని కొట్టిపారవేయలేం. అసలు యూరోపియన్ యూనియన్ కి సగం పైగా నిధులు సమకూర్చే జర్మనీ నాకెందుకు గాలికి కొట్టుకుపోయే పేల పిండి బాధ్యత అని పక్కకి తప్పుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు అమెరికా నీడ నుంచి బయట పడితేనే కానీ సుఖంగా ఉండలేము అన్న సత్యాన్ని ఇకనైనా యూరప్ దేశాలు గ్రహించాలని హెచ్చరిస్తున్నారు.
గ్లోబల్ ఎకానమీ అంటూ అన్ని దేశాలు ఒక దాని మీద ఇంకొకటి ఆధారపడం వల్ల అభివృద్ధి ఏమో కానీ ఎవరో వేల మైళ్ళ దూరంలో తుమ్మితే ఆ తుంపరలు ఇతర దేశాల మీద పడుతున్నాయి. ప్రస్తుతం పుతిన్ చావు దెబ్బ వల్ల జర్మనీ కకావికలం అవుతున్నది. రేపు ఇంకా ఏ దేశం ఆ ప్రభావానికి గురవుతుందో చెప్పలేము. ఒకటి మాత్రం వాస్తవం నాటో పేరుతో రష్యాకు అమెరికా తమలపాకుతో ఒకటి ఇస్తే.. పుతిన్ మాత్రం తలుపు చెక్కలతో రెండు ఇస్తున్నాడు. ఇంతకీ ఏమిస్తున్నాడో చెప్పాల్సిన పనిలేదు అనుకుంటా.
Also Read:Moonlighting: మూన్ లైటింగ్ పై ఐటీ కంపెనీలు ఎందుకు భయపడుతున్నాయంటే
[…] […]