Director Prashanth Neel: నేటి తరం స్టార్ హీరోలలో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ స్టేటస్ ని సంపాదించిన టాప్ 2 హీరోలు ఎవరు అంటే మనకి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు రామ్ చరణ్ మరియు ప్రభాస్..రామ్ చరణ్ కి మగధీర సినిమా నుండే నేషనల్ వైడ్ పాపులారిటీ ఉంది..ఈ ఏడాది విడుదలైన #RRR సినిమా తో అయితే ఆయన నేషనల్ లెవెల్ ని కూడా దాటి ఇంటర్ నేషనల్ లెవెల్ ఫేమ్ ని సంపాదించుకున్నాడు..ఇక ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి స్టార్ స్టేటస్ తెచుకున్నాడో మన అందరికి తెలిసిందే..ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా మన టాలీవుడ్ టాప్ హీరోల హిట్ సినిమా రేంజ్ లో వసూళ్లను రాబడుతాయి..ఇద్దరు ఇద్దరే..ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు..కానీ ఇటీవల విడుదలైన ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ ప్రీ ఫస్ట్ లుక్ రామ్ చరణ్ మరియు ప్రభాస్ అభిమానుల మధ్య పెద్ద చిచ్చుని రగిలించింది.

అసలు విషయానికి వస్తే ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..శ్రీ రాముడిగా ప్రభాస్ ని అభిమానులు చాలా గొప్ప గెటప్ లోనే ఊహించుకున్నారు..కానీ వారి ఊహలకు ప్రభాస్ లుక్ అంచనాలను కాస్త కూడా అందుకోలేకపోవడం తో అభిమానులు బాగా నిరాశకి చెందారు..అదే సమయం లో రామ్ చరణ్ ఫాన్స్ #RRR సినిమాలో రామ్ చరణ్ రామునితో పోలి ఉన్న అల్లూరి సీతారామరాజు గెటప్ ని మరియు ప్రభాస్ గెటప్ ని పెట్టి పోలుస్తూ రాముడు అంటే ఇలా ఉండాలి అని కామెంట్స్ చెయ్యడం తో ఇరువురి హీరోల అభిమానుల మధ్య పెద్ద గొడవే జరిగింది.

దానికి బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ పోలికలు పోలుస్తూ ఆదిపురుష్ లో రామ్ చరణ్ ని పెట్టి ఉంటె ఆ పాత్ర కి వంద శాతం న్యాయం జరిగేది అంటూ కామెంట్స్ చేసారు..ఈ గొడవ పెద్దదిగా మారిపోయింది..ఇక ప్రతి ఒక్కరు ట్విట్టర్ ఇద్దరిలో ఎవరు బాగున్నారు అని తెలుసుకోవడానికి వోటింగ్ పెట్టారు..ఈ వోటింగ్ లో అత్యధిక శాతం రామ్ చరణ్ కి వోట్ వేశారు..మరో విశేషం ఏమిటి అంటే ప్రభాస్ తో ‘సలార్’ వంటి పాన్ ఇండియన్ సినిమాని తీస్తున్న ప్రశాంత్ నీల్ కూడా రామ్ చరణ్ కి వోట్ వెయ్యడం పెద్ద చర్చకి దారి తీసింది..ప్రభాస్ తో సినిమా చేస్తూ ఇలా ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తావు అని ఆయన అభిమానులు ప్రశాంత్ నీల్ ని ట్యాగ్ చేసి తిట్టడం ఆరంభించారు..అలా ఆది పురుష్ మూవీ ప్రీ ఫస్ట్ లుక్ ఇన్ని వివాదాలకు దారి తీసింది.