Prakash Raj Srihari Relation: ఇండస్ట్రీలో ఉన్నవాళ్లలో చాలా మంది మధ్య బంధుత్వం ఉంటుంది. కానీ కొన్ని రిలేషన్స్ గురించి సాధారణ జనాలకు తెలియదు. రియల్ స్టార్ శ్రీహరి, ప్రకాష్ రాజ్ లను వెండితెరపై అనేక చిత్రాల్లో చూశారు. వారిద్దరు కలిసి విలన్స్ గా చేశారు. శ్రీహరి హీరో అయ్యాక ఆయన చిత్రాల్లో ప్రకాష్ రాజ్ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వారిద్దరూ బంధువులు. వరుసకు తోడళ్ళుల్లు అవుతారు. శ్రీహరి భార్య డిస్కో శాంతి, ప్రకాష్ రాజ్ మాజీ భార్య లలిత కుమారి వరుసకు అక్కా చెల్లెల్లు.
తమిళ నటుడు సి ఎల్ ఆనందన్ కూతుళ్లయిన డిస్కో శాంతి, లలిత కుమారి పరిశ్రమలో అడుగుపెట్టారు. డాన్సర్ గా డిస్కో శాంతి వందకు పైగా చిత్రాల్లో చేశారు. లలిత కుమారి నటిగా తమిళ చిత్రాలు చేశారు. నటుడు ప్రకాష్ రాజ్ ని లలిత కుమారి 1994లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. దురదృష్టవశాత్తు కొడుకు చనిపోయాడు. పదిహేనేళ్లకు పైగా ప్రకాష్ రాజ్-లలిత కుమారి కలిసి కాపురం చేశారు.
Also Read: Adipurush Teaser: మరికొన్ని గంటల్లో ఆదిపురుష్ టీజర్… బయటికొస్తున్న సంచలన విషయాలు!
కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ప్రకాష్ రాజ్-లలిత కుమారి విడిపోవాలని డిసైడ్ అయ్యారు. ఆ సమయంలో లలిత కుమారికి వరుసకు బావ అయ్యే శ్రీహరి కలుగజేసుకున్నారు. ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రకాష్ రాజ్ తో ఉన్న పరిచయంతో విడాకుల విషయంలో ఒకసారి ఆలోచించు, పిల్లల కోసమైనా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని శ్రీహరి బ్రతిమిలాడాడట. అప్పటికే స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన ప్రకాష్ రాజ్ ససేమిరా అన్నారట.
2009లో ప్రకాష్ రాజ్-లలిత కుమారి విడాకులు తీసుకొని అధికారికంగా విడిపోయారు. లలిత కుమారితో విడిపోయిన ఏడాదికి 2010లో డాన్స్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ప్రకాష్ రాజ్ వివాహం చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ తన మరదలితో విడిపోయినా శ్రీహరి ఆయనతో మంచి రిలేషన్ మైంటైన్ చేశారు. లలిత కుమారి మాత్రం మరో వివాహం చేసుకోలేదు. ఆ విధంగా తెలుగు హీరో శ్రీహరి కన్నడ నటుడైన ప్రకాష్ రాజ్ కి బంధువు అయ్యాడు. శ్రీహరి 2013లో అనారోగ్యంతో అకాల మృతి చెందారు.
Also Read:
Koratala Shiva- Jr. NTR: ఎన్టీఆర్ మిడిల్ క్లాస్ కష్టాలు.. సంచలన కథ రాసిన కొరటాల శివ !