Italy PM Giorgia Meloni: ఆమెకు దేశం ముఖ్యం. ఆ దేశంలోని ప్రజల ముఖ్యం. తన పురిటిగడ్డ సంస్కృతిని కాపాడేందుకు ఏమైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది. ఆ తెగువే ఆమెను అధ్యక్షురాలిని చేసింది.
జార్జియ మోలోని – ఇటలీ చరిత్రలో మొట్ట మొదటి మహిళా ప్రధానిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నది !
అయితే ఇందులో విశేషం ఏముంది అంటే..
రైట్ వింగ్ సపోర్టర్ అయిన మోలోని నేను,నా దేశం,నా మతం, నా దేశ సంస్కృతి అనే నినాదాన్ని గట్టిగా ప్రజలలోకి తీసుకెళ్లగలిగింది.
జార్జియ మెలోని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆమెను వార్తల్లో వ్యక్తిని చేశాయి
“ఇటలీ లో కొత్తగా ఎలాంటి మసీదులని కట్టనివ్వను !
కొత్తగా మసీదు కట్టాలి అంటే ఆ మసీదు ఇమామ్ ఎవరో ముందుగా తెలపాలి మాకు.
రోజూ మసీదులో చేసే ప్రార్ధనకి అర్ధం ఏమిటో మాకు తెలుసు.
మసీదులకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ?
మసీదులలో చేసే ప్రార్ధనలు కేవలం ఇటాలియన్ భాషలో చేయాలి.
మసీదులలో అరబిక్ భాషలో ప్రార్ధన చేయడానికి అనుమతి ఇవ్వను” ఇలాంటి వ్యాఖ్యలు జార్జియ మెలోని ని ఇటలీ ప్రజలకు బాగా దగ్గర చేసింది. అయితే మెలోని అంటే ఇష్టపడని వాళ్ళు మాత్రం ముస్సోలిని వారసురాలు అని విమర్శిస్తున్నారు.

రైట్ వింగ్ యాక్టివిస్ట్
జార్జియా మెలోని రైట్ వింగ్ యాక్టివిస్ట్ అని తెలిసీ ప్రజలు ఆమెకు మద్దతుగా నిలచారు అంటే ఇటలీ ప్రజల ఆలోచనా సరళి ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త ఆలోచనా ధోరణి మంచిదేనా ? మతం ప్రాతిపదికగా ఉన్న సిద్ధాంతాలకి ప్రజలు పట్టం కడుతున్న రోజులు ఇవి. జార్జియా మెలోని ఫక్తు కాథలిక్ క్రిస్టియన్. అదే సమయంలో కేధలిక్ క్రిస్టియన్ కాని వారి పట్ల ఏ మాత్రం సానుభూతి లేదు. అంటే పక్కా రైట్ వింగ్ యాక్టివిస్ట్ అనే అనుకోవాల్సి ఉంటుంది. మతం,దేశం ఈ రెండూ కలగలిసిన రాజకీయం ఇప్పుడేమీ కొత్త కాదు. ఆ మాటకొస్తే రెండు క్రూసేడ్ యుద్ధాలు జరిగింది దేని కోసం ?
యూరప్ ముఖ చిత్రం మారుతున్నది !
ఒక సారి ఫ్రాన్స్ ని పరిశీలిస్తే మొదట్లో ఉదారవాదాన్ని నెత్తినపెట్టుకొని తద్వారా వలసలని ప్రోత్సహించి దరిమిలా తాము ఇతర దేశాలకంటే సమానత్వాన్ని గౌరవిస్తామని గొప్పలకి పోయింది. కానీ ఈ రోజున ఫ్రాన్స్ లో ఉన్న పరిస్థితి ఏమిటి ? పారిస్ లోని కొన్ని ప్రదేశాలలో ముస్లిమేతరులకు ప్రవేశం ఉండదు. ఒకవేళ ఆయా ప్రదేశాలలోకి ఎవరన్నా వెళ్ళినా సురక్షితంగా తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. పారిస్ పోలీసులు కూడా ఆ ప్రాంతాలలోకి స్వేచ్ఛగా వెళ్లలేరు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఆ దేశంలో ముస్లింల మీద కఠిన ఆంక్షలు విధించాడు. గత ఎన్నికలలో రెండో సారి మాక్రాన్ గెలిచినప్పుడు అంతో కొంత ఫ్రాన్స్ ప్రజలలో అసంతృప్తి కలిగింది అన్నది వాస్తవం. మాక్రాన్ తో అధ్యక్ష పదవికి పోటీ పడ్డ మేరీ లీ పెన్ ఫక్తు రైట్ వింగ్ యాక్టివిస్ట్. కానీ తృటిలో తప్పిపోయింది ఈవిడకి అధ్యక్ష పదవి. అలా అని లీ పెన్ మళ్ళీ అధ్యక్షపదవికి పోటీ చేసే అవకాశం ఉంది అలాగే గెలుస్తుంది కూడా. లీ పెన్ కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరూ మంచి మిత్రులు. గత ఎన్నికల సమయం లో పుతిన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న లీ పెన్ కి విరాళాలు కూడా ఇచ్చాడు.
శరణార్థులతో జర్మనీ ఇబ్బందులు పడుతోంది
జర్మనీ ఇప్పటికే శరణార్ధుల రూపంలో వచ్చిన వాళ్ళతో చాల ఇబ్బందులని ఎదుర్కుంటున్నది. పెరిగిన ఇంధనం,ఆహార పదార్ధాల ధరలతో సతమతం అవుతున్న జర్మనీకి సిరియా,ఆఫ్ఘనిస్తాన్ ల నుండి వచ్చిన శరణార్ధుల వల్ల మరింత ఇబ్బందులకి గురువతున్నది. అప్పటి జర్మనీ ఛాన్స్లర్ మోర్కెల్ ఉదార స్వభావం తో ఆశ్రయం ఇచ్చింది సిరియా,ఆఫ్ఘనిస్తాన్ శరణార్ధులకి కానీ ఇప్పుడు వాళ్ళని భరించడం చాలా కష్టంగా మారింది.
బెల్జియం
1960వ దశకంలో బెల్జియంలో కూలి పని చేయడానికి అంటూ మొరాకో దేశం నుండి వలసలని ప్రోత్సహించింది అప్పటి ప్రభుత్వం. అలా మొరాకో,టర్కీ దేశాల నుంచు బెల్జియానికి వలస వచ్చిన వాళ్ళు క్రమంగా అక్కడి పౌరసత్వం తీసుకొని ఉండిపోయారు. 2018 లో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో షరియా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపుగా కోటి జనాభా ఉన్న బెల్జియం దేశంలో అత్యధిక ముస్లిం ప్రజలు ఉన్నది రాజధాని బ్రస్సెల్స్ లోనే. అయితే ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆందోళనలు లేకపోయినా భవిష్యత్తులో మాత్రం బెల్జియాన్ని ముస్లిం దేశంగా మారుస్తామంటూ అక్కడి ఇస్లాం పార్టీ ప్రకటించింది.
ఇక బ్రిటన్ గురించి
తాజాగా బ్రిటన్ లోని లీసెస్టర్ ప్రాంతంలో జరిగిన సంఘటనలని చూస్తే ప్రస్తుతం బ్రిటన్ అగ్నిపర్వతం మీద ఉన్నది అనే చెప్పాల్సి ఉంటుంది.
-పోలండ్
గతంలో సిరియా శరణార్ధులని అక్కున చేర్చుకున్న పోలండ్ ప్రస్తుతం వాళ్ళని తిరిగి పంపిస్తున్నది. ఇక ఇటలీ విషయానికి వస్తే రైట్ వింగ్ విజయం వలన ముందు ముందు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఊహించడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. 2016 లెక్కల ప్రకారం ఇటలీ లో మొత్తం ముస్లిం జనాభా 14,00,000 [పద్నాలుగు లక్షల మంది ] ఉన్నారు. వీళ్లలో 2 లక్షల 50 వేల మందికి ఇటలీ పౌరసత్వం ఉంది. మిగిలిన వాళ్ళలో అక్రమంగా ఎంత మంది ఉన్నారో అలాగే ఉద్యోగార్ధం ఎంత మంది ఉన్నారో సరి అయిన వివరాలు లేదు. ఇప్పుడు కొత్తగా ప్రధాని పదవిని స్వీకరించబోతున్న జార్జియా మెలోని అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపిస్తుందా ? ఖచ్చితంగా పంపిస్తుంది. అయితే ఈ పని అంత సజావుగా ప్రశాంతంగా జరిగే అవకాశాలు లేవు. ఎందుకని ? ఇటలీ లోని లెదర్ పరిశ్రమలలలో దాదాపుగా 2 లక్షల మంది చైనా పౌరులు పని చేస్తున్నారు.

స్వతహాగా కమ్యూనిస్ట్ దేశం అయిన చైనా కి ఇటలీ లో అందులోనూ కీలకమయిన యూరోప్ దేశంలో రైట్ వింగ్ ప్రభుత్వం ఉండడం సుతారం ఇష్టపడదు. కాబట్టి ఎన్ని లక్షల డాలర్లు ఖర్చు పెట్టి అయినా అక్కడ ఘర్షణలని ప్రోత్సహిస్తుంది. అంటే ఇటలీ లో అక్రమంగా ఉంటున్న ఇతర దేశాల ముస్లిం పౌరులని వెనక్కి పంపే ప్రక్రియలో ఘర్షణ వాతావరణాన్ని ఎదుర్కోకక తప్పదు. అలాగే ఇటలీ లో ఉన్న ఉదారవాద లెఫ్టిస్ట్ లకి చైనా నుంచి నిధులు అందుతాయి కాబట్టి ఘర్షణ తప్పదు. ఈ క్రమంలో దౌత్య పరమయిన విభేదాలు వచ్చి తీరుతాయి కాబట్టి జార్జియా మెలోని ఎంత కఠినంగా వ్యవరిస్తుందో అన్న దాని మీద ఇటలీ,చైనా ల మధ్య సంబంధాలు ఉండబోతున్నాయి. అయితే ఆర్ధడాక్స్ క్రైస్తవాన్ని ఆచరించే రష్యా మీద జార్జియా మెలోని ఎలాంటి సంబంధాలని నెరపుతారో అనే ఉత్సుకత ఇప్పటికే ఉంది. ఒక వేళ జార్జియా మెలోని కనుక పుతిన్ వైపు మొగ్గు చూపితే అది యూరోపు యూనియన్ విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. మరో మూడేళ్ళ తరువాత ఫ్రాన్స్ లో లీ పెన్ అధికారంలోకి వస్తే అది రష్యాకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే జర్మనీ లోపాయికారిగా రష్యా కే మద్దతు తెలుపుతున్నది. కాబట్టి జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ లు రష్యా వైపు మొగ్గు చూపితే అది అమెరికా వినాశనానికి కారణం అవుతుంది. ఇది ఇలానే జరగాలి అని లేదు. జరగకూడదని లేదు. మార్పు అనేది మొదలయ్యాక ఎవరూ దానిని ఆపలేరు.