Congress Rajya Sabha List: దేశంలో రాజ్యసభ ఎన్నికల కోసం నగారా మోగడంతో ప్రధాన పార్టీల్లో ఆందోళన మొదలైంది. కీలకమని భావించిన నేతలకు కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. దీంతో వారు ఏం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. భవిష్యత్ లో వారు పార్టీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వారిపై పార్టీలో ప్రధాన చర్చ జరుగుతుండగా వారికి అభ్యర్థుల ఎంపికలో పార్టీలు ఏ ప్రాతిపదిక పాటిస్తున్నాయో అర్థం కావడం లేదు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి పార్టీల్లో మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారమే ప్రధాన లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయన్నది నిర్వివాదాంశమే. అయినప్పటికి దేశంలో పార్టీల వైఖరి ఏంటనేది ఇంకా అంతుచిక్కడం లేదు.
రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడటంతో పార్టీలు తమ నేతల పేర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితా వెల్లడించింది. అందులో ముఖ్య నేత అయిన గులాం నబీ ఆజాద్ పేరు లేకపోవడం గమనార్హం. దీంతో ఆయనను కావాలనే పక్కన పెట్టిందా అనే అనుమానాలు వస్తున్నాయి. జీ23 నేతలుగా అసమ్మతి నాయకులుగా చెప్పుకుంటున్న వారిలో ఆజాద్ కూడా ఒకరు కావడం తెలిసిందే. దీంతో ఆజాద్ భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన పార్టీ మారే సూచనలు ఉన్నాయనే వాదనలు కూడా వస్తున్నాయి.
Also Read: Chandrababu: చంద్రబాబు భారీ స్కెచ్.. ఏపీకి పది నెలలు అంకితం
మరోవైపు ఆజాద్ ను బీజేపీ తన వైపు తిప్పుకునే వీలుంది. ప్రధానితో మంచి సంబంధాలున్న నేతల్లో గులాం నబీ ఆజాద్ కూడా ఒకరు కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ఆజాద్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీపై ఆధిపత్యం చెలాయించాలంటే వారి నేతలను తమ వైపు తిప్పుకునే క్రమంలోనే గులాం నబీ ఆజాద్ ను తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసమే ఆయనకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే రెండో జాబితాలో గులాం నబీ ఆజాద్ కు స్థానం దక్కుతుందని పలువురు పార్టీ నేతలు పేర్కొనడం గమనార్హం. కానీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల్లో ఇంకా పెను మార్పులు సంభవించే సూచనలు వస్తున్నాయి. పార్టీలు తమవైఖరులు వెల్లడి చేయకుండా ఇతర పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆజాద్ కు రాష్ట్రపతి పదవి ఆఫర్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఆజాద్ నిర్ణయం ఎలా ఉంటుందో ఇంకా అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? లేక బీజేపీలో చేరి రాష్ట్రపతి పదవి అలంకరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే మరి.
Also Read:Gujarat Titans IPL 2022 Champion: ఐపీఎల్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఇంత ఈజీగా ఎలా గెలవగలిగింది?