India Population: ఇరుగుపొరుగు బాగుంటేనే ఇల్లు చల్లగా ఉంటుందని ఒక సామెత. అదేం దురదృష్టమో కానీ.. మన దేశం చుట్టూ ఉన్న పొరుగు మొత్తం మన కీడు కోరుకునే వాళ్లే. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నరమేధం కొనసాగిస్తోంది. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. శ్రీలంక తమిళ జాలర్ల మీద దాడి చేస్తుంది.. మయన్మార్ అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తన జనాభాను మనదేశంలోకి పంపిస్తుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే పొరుగు దేశాలతో ఎన్నో సమస్యలు. పోనీ భారత్ ఏమైనా ఆదేశాల మీద దండెత్తిందా? యుద్ధాలు ఏమైనా చేసిందా అంటే? లేదు..కానీ అక్కసుతో ఆ దేశాలు చేసే కుట్రలకు భారత్ ఇబ్బంది పడుతూనే ఉంది. తాజాగా ఈ జాబితాలోకి జర్మనీ చేరింది.. ఇంతకీ దీని అక్కసు ఏమిటయ్యా అంటే.
ఇటీవల ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. దీనిని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. యథా లాపంగానే చైనా తన అక్కసు ప్రదర్శించింది. ” జనాభా పెరగడం ముఖ్యం కాదు.. క్వాలిటీ ముఖ్యం అంటూ” నెత్తి మాసిన మాటలు మాట్లాడింది.. వాస్తవానికి చైనా దేశంతో పోల్చితే భారత్ లో యువతరం ఎక్కువ. అయితే ప్రపంచ దేశాల ముందు చులకన చేసేందుకు భారతదేశంలో చైనా విమర్శలు చేసింది. దీనిపై భారత్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో జర్మనీ కూడా చేరింది. ప్రపంచ నాల్గవ ఆర్థిక శక్తిగా పేరుపొందిన జర్మనీ.. దాని స్థానానికి బీటలు వారుతున్న నేపథ్యంలో… యూరో జోన్ లో ఉన్న ఆ దేశం ఇప్పుడు చైనా ప్రాపకం కోసం ఉవ్విళ్ళూరుతోంది. అంతేకాదు ప్రపంచానికి ఆటోమొబైల్ పాఠాలు చెప్పిన ఆ దేశం.. ఇప్పుడు బేల చూపులు చూస్తోంది.. అందుకే భారత్ పై విషం చిమ్ముతున్నది. భారత్ అంటే చైనాకు కోపం కాబట్టి.. భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఆవిర్భవించింది కాబట్టి.. అది చైనాకు నచ్చదు కాబట్టి.. జర్మనీ ఈ విధంగా నరుక్కోస్తొంది. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఆవిర్భవించిన నేపథ్యంలో దానిని చులకన చేస్తూ జర్మనీ దేశానికి చెందిన ఒక పత్రిక కార్టూన్ ప్రచురించింది. ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.
భారత్ జనాభా ఇటీవల చైనా జనాభా సంఖ్యను దాటిన సంగతి తెలిసిందే. అయితే దీనిని హేళన చేస్తూ జర్మనీ దేశానికి చెందిన మేగజైన్ “డేర్ స్పీజెల్” ఒక కార్టూన్ ను ప్రచురించింది. చైనా దేశానికి చెందిన ఆధునిక బుల్లెట్ రైలు, భారతదేశానికి చెందిన ఒక సాధారణ రైలును దాటి వెళుతున్నట్టు చిత్రీకరించింది. పైగా భారత రైలు కిక్కిరిసి ఉన్నట్టు, రైలుపై కూడా జనం భారీగా కూర్చున్నట్టుగా అందులో చూపించింది. అయితే ఈ కార్టూన్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారాన్ని రేపింది.
“భారత్ పై విషం కక్కుతున్న జర్మనీ.. ఒకసారి తన చరిత్ర ఏమిటో ఇక్కడ తెలుసుకోవాలి. జాతి అహంకారానికి నిలువెత్తు రూపమైన జర్మనీ భారత్ లాంటి సౌమ్య దేశానికి పాఠాలు చెప్పడం ఏంటి? చైనా ప్రాపకం కోసం భారత్ మీద విషం చిమ్మడం నిజంగా దారుణాతీ దారుణం.” అని “డేర్ స్పీజెల్” మ్యాగ జైన్ మీద భారతదేశానికి చెందిన రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామూహిక హత్యల వంటి చరిత్ర కలిగిన జర్మన్లు, ముందుగా తమను తాను ఒకసారి చూసుకోవాలని సూచిస్తున్నారు. భారతదేశాన్ని పేద దేశంగా చూపించేందుకే పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తుంటాయని వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ దేశాలకు చెందిన మీడియా భారత్లో అభివృద్ధిని చూపించదని విమర్శించారు. జర్మనీ దాటి భారత నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో తట్టుకోలేకపోతోందని విమర్శించారు. మరోవైపు డేర్ స్పీజెల్ తన పేరును జాతీ అహంకార, ట్రోలింగ్ పత్రికగా పేరు మార్చుకోవాలని బిజెపి నాయకులు సూచిస్తున్నారు.
#Germany this is outrageously racist. @derspiegel caricaturing India in this manner has no resemblance to reality. Purpose is to show #India down and suck up to #China.
This is as bad if not worse than the racist cartoon in @nytimes lampooning India’s successful Mars mission. pic.twitter.com/z9MxcPQC7u— Kanchan Gupta (@KanchanGupta) April 23, 2023