టీడీపీలో ఇప్పుడు ముగ్గురిదే రాజ్యం.. ఒకటి చంద్రబాబు.. రెండోది చినబాబు లోకేష్.. మూడోవది.. కాబోయే ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే.. అవును ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు తర్వాత ఉప శాసనసభా పక్ష నేత మన అచ్చెన్నే. అయితే అంతటి పవర్ ఫుల్ నేత ఇప్పుడు వైసీపీ ధాటికి ఈఎస్ఐ స్కాంలో ఇరుక్కొని జైలు పాలయ్యారు. అయితే విడుదలయ్యాక తన గురువు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ పాదాలకు మొక్కి ఆశ్వీరాదం తీసుకున్నారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అశీర్వచనాలు తీసుకున్న వారం రోజులకే గౌతు శివాజీ కూతురు .. శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షురాలును జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించి షాక్ ఇచ్చారు. ఆమె ప్లేసులో పార్లమెంట్ ఇన్ చార్జిగా రవికుమార్ ను నియమించారు. దీంతో ఆ జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Also Read : టాప్ ప్లేస్‌లో ఎన్‌టీవీ.. సెకండ్‌కు పడిపోయిన టీవీ9?
కాళ్లకు మొక్కిన అచ్చెన్న.. గౌతు శివాజీ కుటుంబానికి అన్యాయం చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. అచ్చెన్నకు తెలియకుండా ఇది జరిగిందా? లేక బాబు-అచ్చెన్న కలిసే ఇలా చేశారా అన్నది ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇఫ్పుడు ఆ జిల్లాలో జోరుగా చర్చకు దారితీసింది.
తెలుగుదేశం పార్టీలో కొత్త పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జులు, కో ఆర్డినేటర్ల నియామకాలు చిచ్చుపెట్టాయన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన రవికుమార్ ను చంద్రబాబు ఎంపిక చేయడంపై అసంతృప్తి చెలరేగింది. ఆ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న గౌతు శిరీష పక్కనపెట్టడం దుమారం రేపిందట.. టీడీపీలో కీలక నేతగా ఉన్న అచ్చెన్నకు తెలియకుండా ఈ నియామకం జరిగి ఉండదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఓ వైపు కాళ్లు మొక్కుతూనే మరోవైపు గౌతు శివాజీకి అచ్చెన్న ఎసరు పెట్టాడని శ్రీకాకుళంలో కొందరు టీడీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇక సీనియర్ నేత గౌతు శివాజీకి కనీసం మాట మాత్రం అయిన చెప్పకుండా ఆయన కూతురును జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించడం ఆ పార్టీలో చిచ్చురేపుతోందట. గౌతు కుటుంబంపై చంద్రబాబు ఏమాత్రం అభిమానం చూపడం లేదని.. వారంతా అసంతృప్తితో ఉన్నట్టు ఆ జిల్లాలో ప్రచారం సాగుతోంది.
Also Read : హేమంత్ హత్య కేసులో ట్విస్ట్.. పెరుగుతున్న నిందితులు