కరోనాపై పోరాటానికి గంభీర్ సాయం

దేశంలో కరోనా కట్టడికి కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో వ్యాపార, వాణ్యిజ్య సంస్థలు మూతపడగా ప్రజారవాణా స్తంభించిపోయింది. లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ దేశంలో కరోనా కేసులు పాజిటివ్ కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,100కుపైగా కరోనా కేసులు నమోదుగా 50మంది మృతిచెందారు. కరోనా కట్టడికి సెలబ్రెటీలు తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలువురు సెలబెట్రీలు పీఎం, సీఎం […]

Written By: Neelambaram, Updated On : April 2, 2020 7:05 pm
Follow us on


దేశంలో కరోనా కట్టడికి కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో వ్యాపార, వాణ్యిజ్య సంస్థలు మూతపడగా ప్రజారవాణా స్తంభించిపోయింది. లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ దేశంలో కరోనా కేసులు పాజిటివ్ కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,100కుపైగా కరోనా కేసులు నమోదుగా 50మంది మృతిచెందారు. కరోనా కట్టడికి సెలబ్రెటీలు తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలువురు సెలబెట్రీలు పీఎం, సీఎం సహాయనిధులకు విరాళాలను ప్రకటించారు.

తాజాగా కరోనా నివారణ కోసం బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన రెండేళ్ల జీతాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ప్రతీఒక్కరూ సాయం అందజేయాలని గంభీర్ తన ట్విట్టర్లో కోరారు. ఎవరికీ తోచినంత వారు పీఎం సహాయనిధికి విరాళాలను ఇవ్వాలని కోరారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వాసుపత్రుల్లో కరోనాకు చికిత్స అందించే వైద్య సామగ్రి కోసం తన ఎంపీ నిధుల నుంచి 50లక్షల నిధులను విడుదల చేశారు. కరోనా పోరాటానికి గంభీర్ చేస్తున్న కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.
Also Read: కరోనా విరాళం టాటా తరవాత అజీమ్ ప్రేమజీ