
మైటీ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్‌గా విడుదలైన మోషన్ పోస్టర్, రామ్‌చరణ్ బర్త్‌డే వీడియో ప్రోమోకు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన వచ్చింది. అయితే సినీ విమర్శకులు మాత్రం రాజమౌళి మోషన్ పోస్టర్‌ను కాపీ కొట్టాడని గగ్గోలు పెడుతున్నారు. గతంలో కూడా బాహుబలి 2 చిత్రం యొక్క `చేతిలో బిడ్డ పోస్టర్ ` విడుదల అయినపుడు కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. అయినా వాటిని రాజమౌళి కేర్ చేయలేదు.
ఇక ఇప్పటి విషయానికి వస్తే రాజమౌళి ‘‘రౌద్రం రణం రుధిరం’’ ను మూడు దశాబ్దాల క్రిందట వచ్చిన ఓ హాలీవుడ్ సినిమా ‘ఫైర్ అండ్ ఐస్’కు లింకు పెట్టి మాట్లాడుతున్నారు. 1983లో విడుదలైన ఫాంటసీ మూవీ “‘ఫైర్ అండ్ ఐస్”కు ఆర్ ఆర్ ఆర్ సినిమా కాపీ అని తమకున్న సినీ పరిజ్ఞానాన్నిబయట పెడుతున్నారు
నిజానికి 1983 లో వచ్చిన ఫైర్ అండ్ ఐస్ మూవీ యానిమేటెడ్ చిత్రం. పైగా అందులో సోషల్ స్ట్రక్చర్ ఉన్న పాత్రలు అసలే లేవు. కానీ ఆర్ ఆర్ ఆర్ చిత్రం అలా కాదు ఎమోషన్స్‌ను, హీరోయిజాన్ని మిక్స్ చేసి తీస్తున్న చిత్రం. ఇలాంటి చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించడంలో రాజమౌళి దిట్ట. అందుకే రాజమౌళి కి అపజయం ఆమడ దూరంలోనే ఆగిపోయింది.