https://oktelugu.com/

Gautam Adani: అదానీ ప్రపంచంలోనే కుబేరుడిగా ఎందుకు ఎదుగుతున్నాడు? ఇంత డబ్బు ఎక్కడిది?

Gautam Adani: సంపద సంపన్నుల చేతుల్లోనే నిక్షిప్తం అయిపోతోంది. డబ్బు కొందరి చేతుల్లోనే బందీ అయిపోతోంది. సంపన్నులు ధనవంతులుగా మారుతున్నారు.పేదవారు మరింత దారిద్ర్యంలోకి దిగజారుతున్నారు. దేశంలో సంపన్నుల జాబితా పెరిగిపోతుండగా పేదవారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ధనవంతులు మరింత అందలాలు ఎక్కుతూ పేదవారు మాత్రం కటిక దారిద్ర్యంలోకి వెళ్తున్నారు. సంపద కొందరి చేతుల్లో ఉంటే ఆర్థిక వ్యత్యాసాలు ఏర్పడతాయనేది జగమెరిగిన సత్యమే. ఇటీవల వెల్లడించిన సర్వేలో దేశంలో సంపన్నుల జాబితా పెరిగిపోతోందని చెప్పడం గమనార్హం. గతంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 17, 2022 / 11:32 AM IST
    Follow us on

    Gautam Adani: సంపద సంపన్నుల చేతుల్లోనే నిక్షిప్తం అయిపోతోంది. డబ్బు కొందరి చేతుల్లోనే బందీ అయిపోతోంది. సంపన్నులు ధనవంతులుగా మారుతున్నారు.పేదవారు మరింత దారిద్ర్యంలోకి దిగజారుతున్నారు. దేశంలో సంపన్నుల జాబితా పెరిగిపోతుండగా పేదవారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ధనవంతులు మరింత అందలాలు ఎక్కుతూ పేదవారు మాత్రం కటిక దారిద్ర్యంలోకి వెళ్తున్నారు. సంపద కొందరి చేతుల్లో ఉంటే ఆర్థిక వ్యత్యాసాలు ఏర్పడతాయనేది జగమెరిగిన సత్యమే. ఇటీవల వెల్లడించిన సర్వేలో దేశంలో సంపన్నుల జాబితా పెరిగిపోతోందని చెప్పడం గమనార్హం.

    Gautam Adani

    గతంలో అంబానీ కుటుంబమే సంపన్నులుగా ఉండేది. కాలక్రమంలో అదానీ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు. కనిపించిన ఆస్తిని అవలీలగా కొనేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏ సంస్థ వేలానికి వచ్చినా తాను ఉన్నానని వేలంలో ఆస్తులను దక్కించుకుని తన సంపదను అమాంతం పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇండియా నుంచి వ్యాపారం ఎత్తేయాలని నిర్ణయించుకున్న హోల్సిమ్ సిమెంట్ కంపెనీని అదానీ రూ. 80 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. దీంతో ఇంత మొత్తం పెట్టి సిమెంట్ కంపెనీని చేజిక్కించుకోవడంతో అందరిలో ఒకటే ఉత్కంఠ నెలకొంది.

    Also Read: CM YS Jagan: వైసీపీలో జగన్ పట్టు సడలుతుందా?.. కట్టుదాటుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు

    దేశంలో ఇప్పటికే ముప్పైకి పైగా కంపెనీలను తమ సొంతం చేసుకున్న అదానీ తన ఆస్తిని రెట్టింపు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గంగవరం-కృష్ణపట్నం పోర్టులను సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్, గౌహతి, ముంబై లాంటి విమానాశ్రయాలను సైతం అదానీ చేజిక్కించుకున్నారు. దేశీయంగా అదానీ గ్రూపు వ్యాపార రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతోంది.

    ఎయిర్ పోర్టులే కాకుండా ఏ సంస్థ అయినా బోర్డు తిప్పేయడమే ఆలస్యం దాన్ని తను దక్కించుకుంటున్నారు.ఇలా వ్యాపారంలో ఎన్నో కంపెనీలను కొనుగోలు చేస్తున్నారు.ఇంత భారీ స్థాయిలో వ్యాపారం కొనసాగడానికి నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయనే ప్రశ్న అందరిలో వస్తోంది. అసలు లెక్కల్లో ఉన్న డబ్బా? లేక బ్లాక్ మనీనా అనే సంశయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ రోజురోజుకు వ్యాపార రంగంలో తనదైన శైలిలో పైకి ఎగబాకుతున్నట్లు చెబుతున్నారు.

    Gautam Adani

    అదానీకి ఇంత భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నదే అనుమానం. నిధులు సమకూరుస్తున్న కంపెనీల పేర్లు అదానీ రహస్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. కానీ అదానీ గ్రూపుకు మూడు విదేశీ కంపెనీలు సమకూర్చుతున్నట్లు సమాచారం. అవి మారిషస్ లోని పోర్ట్ లూయిస్ కు చెందిన ఒకే చిరునామాతో ఉండటం గమనార్హం. నల్ల ధనం మారిషస్ కు తరలించి అక్కడి నుంచి పెట్టుబడులు పెట్టేందుకు నిధులను ఇక్కడకు తీసుకొస్తున్నట్లు భావిస్తున్నారు.మొత్తానికి అదానీ వ్యాపార రంగంలో దూసుకెళ్లడంతో అందరు సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో మర్మమేమిటో అర్థం కావడం లేదు.

    Also Read:AP Congress: జగన్ తో పోరాటానికే సై అంటున్న కాంగ్రెస్?

    Tags