వైసీపీ చెబుతున్న ‘గోవు క‌థ‌..’!

సాధార‌ణ భ‌క్తి విష‌యానికి వ‌స్తే.. దాదాపుగా హిందువులు అంద‌రూ గోవును పూజిస్తారు. కానీ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే స‌రికి గోర‌క్ష‌ణ నినాదం బీజేపీదే అన్న‌ట్టుగా ఉంటుంది ప‌రిస్థితి. అయితే.. ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం పోటీ మొద‌లైందా? అనే సిచుయేష‌న్ క‌నిపిస్తోంది ఏపీలో! గోవును జాతీయ ప్రాణిగా ప్ర‌క‌టించాలంటూ.. వైసీపీ నేత, టీటీడీ చైర్మ‌న్‌ వైవీసుబ్బారెడ్డి కేంద్రాన్ని కోర‌డం విశేషం. అంతేకాదు.. ఆయ‌న నేతృత్వంలోని బోర్డు ఓ తీర్మానం కూడా చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని, దానికి […]

Written By: Bhaskar, Updated On : February 28, 2021 2:29 pm
Follow us on


సాధార‌ణ భ‌క్తి విష‌యానికి వ‌స్తే.. దాదాపుగా హిందువులు అంద‌రూ గోవును పూజిస్తారు. కానీ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే స‌రికి గోర‌క్ష‌ణ నినాదం బీజేపీదే అన్న‌ట్టుగా ఉంటుంది ప‌రిస్థితి. అయితే.. ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం పోటీ మొద‌లైందా? అనే సిచుయేష‌న్ క‌నిపిస్తోంది ఏపీలో! గోవును జాతీయ ప్రాణిగా ప్ర‌క‌టించాలంటూ.. వైసీపీ నేత, టీటీడీ చైర్మ‌న్‌ వైవీసుబ్బారెడ్డి కేంద్రాన్ని కోర‌డం విశేషం. అంతేకాదు.. ఆయ‌న నేతృత్వంలోని బోర్డు ఓ తీర్మానం కూడా చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతామని సుబ్బారెడ్డి చెబుతున్నారు.

Also Read: స్టీల్ ప్లాంటు విషయంలో ఏపీ బీజేపీ మౌనరాగం..

ఆ మ‌ధ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విగ్ర‌హాల ధ్వంసం వ‌రుస‌గా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఏపీ రాజ‌కీయాల‌న్నీ మ‌తం చుట్టూ తిరిగాయి. దీని వెన‌క అధికార పార్టీ ఉందంటూ.. బీజేపీ, టీడీపీ కూడా ఆరోపించాయి. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది. ఈ క్ర‌మంలోనే తాము హిందూత్వానికి వ్య‌తిరేకం కాద‌నే విష‌యాన్ని జ‌నాల్లోకి పంప‌డానికి ప‌లు పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు సీఎం జ‌గ‌న్‌. ఈ నేప‌థ్యంలోనే.. టీటీడీ గోవును జాతీయ ప్రాణిగా ప్ర‌క‌టించాల‌ని తీర్మానం విశేషం.

Also Read: ఏపీలో అభ్యర్థి బరిపై అధికారుల దౌర్జన్యం

అయితే.. రాజ‌కీయంగా తాము హిందువుల‌కు వ్య‌తిరేకంగా కాద‌ని చెప్ప‌డానికే ఈ త‌ర‌హా తీర్మానం చేశార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విష‌యంలో బీజేపీకి తాము ఏ మాత్రం తీసిపోమ‌ని నిరూపించుకోవాలన్న తాపత్రయంతోనే ఈ డిమాండ్ తెర‌పైకి తెచ్చార‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతోంది. మ‌రి, టీటీడీ చేసిన తీర్మానంపై కేంద్రంలోని బీజేపీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.