https://oktelugu.com/

తూర్పుగోదావరిలో మరోసారి గ్యాస్ లీక్..!

విశాఖపట్నం విష‌వాయువు లీక్ దుర్ఘటన నుంచి రాష్ట్రం మరువక ముందే తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తూర్పుపాలెం వ‌ద్ద‌ ఓఎన్‌జీసీ పైప్‌ లైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతోంది. తూర్పు పాలెం నుంచి మోరీ గ్యాస్‌ కలెక్టింగ్‌ స్టేషన్‌కు వెళ్లే పైప్‌లైన్ ‌పగిలిపోవడంతో భారీగా గ్యాస్ బ‌య‌ట‌కు వెలువ‌డుతోంది. దీంతో ఆ ప్రాంత ప్ర‌జ‌లు తీవ్ర‌ భయాందోళనకు గురవుతున్నారు. చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌లు స‌మాచారం మేర‌కు రంగంలోకి దిగిన ఓఎన్‌జీసీ సిబ్బంది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 17, 2020 / 12:39 PM IST
    Follow us on


    విశాఖపట్నం విష‌వాయువు లీక్ దుర్ఘటన నుంచి రాష్ట్రం మరువక ముందే తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తూర్పుపాలెం వ‌ద్ద‌ ఓఎన్‌జీసీ పైప్‌ లైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతోంది. తూర్పు పాలెం నుంచి మోరీ గ్యాస్‌ కలెక్టింగ్‌ స్టేషన్‌కు వెళ్లే పైప్‌లైన్ ‌పగిలిపోవడంతో భారీగా గ్యాస్ బ‌య‌ట‌కు వెలువ‌డుతోంది. దీంతో ఆ ప్రాంత ప్ర‌జ‌లు తీవ్ర‌ భయాందోళనకు గురవుతున్నారు.

    చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌లు స‌మాచారం మేర‌కు రంగంలోకి దిగిన ఓఎన్‌జీసీ సిబ్బంది లీకైన గ్యాస్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్యాస్ లీక్ కి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. పైపులైన్ వల్ల గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఈ జిల్లాలో అనేక పర్యయాలు జరిగాయి. 2014 జూన్ లో నగరం గ్రామంలో పైప్ లైన్ నుంచి గ్యాస్ వల్ల జరిగిన ప్రమాదంలో 12 మంది చనిపోగా అనేక మంది గాయాల పాలయ్యారు.