యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులకు ఈసారి డబుల్ ధమకా ఉండబోతుంది. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సర్ ప్రైజ్ ఉంటుందా? లేదా అనే అయోమయంలో ఉండగా నిర్మాత డీవీవీ దానయ్య క్లారిటీ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తప్పకుండా సర్ ప్రైజ్ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆ సర్ ప్రైజ్ ఏంటనేది మాత్రం చెప్పలేదు. ఇటీవల రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘భీమ్ ఫర్ సీతరామరాజు’ పేరిట విడులైన వీడియో అభిమానులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. చరణ్ యాక్షన్ సీన్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తుండటంతో అతడినేలా చూపిస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి వచ్చే సర్ ప్రైజ్ కోసం అభిమానులు అత్రతుగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దర్శకుడు త్రివిక్రమ్ మరో గుడ్ న్యూస్ చెప్పాడు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో కొత్త మూవీ ప్రారంభం కానుందని ప్రకటించాడు. ఈమూవీ ఫస్టు లుక్, టైటిల్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలిపాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2021మేలో సినిమాను విడుదల చేయనున్నట్లు సీతార ఎంటటైన్మెంట్ అధినేత సూర్యదేవర నాగవంశీ గతంలోనే ప్రకటించారు. ఈ మూవీకి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇదే టైటిల్ ప్రకటిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.. ఈసారి యంగ్ టైగర్ పుట్టిన రోజుకు ఒకేసారి డబుల్ ధమకా ఉండటంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.