టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీ ఫామ్ ఇస్తేనే ఎమ్మెల్యే అయ్యారు గంటా శ్రీనివాసరావు. 1999 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా గంటాకు తొలిసారి రాజకీయాల్లో చాన్స్ బాబు కల్పించారు. ఆ తరువాత ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్లిన ఆయన.. మళ్లీ టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికల తరువాత గంటా చంద్రబాబుతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. పైగా ఆయన అసెంబ్లీ సమావేశాలల్లో కూడా పెద్దగా కనిపించడంలేదు.
Also Read: చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావ్.. చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని నిప్పులు
అటు పార్టీ కార్యక్రమాల్లోకూ ఆయన హాజరు కావడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబుతో తనకు కొంత ఎడం ఉన్న మాట నిజమేనని గంటా చెప్పడం విశేషం. 2019 ఎన్నికల వేళ తనను విశాఖ ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు కోరారని, తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని, అది కమ్యూనికేషన్ గ్యాప్ అయినా కూడా ఆ తరువాత చంద్రబాబును పెద్దగా కలవలేదని గంటా చెప్పుకొచ్చారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్లకు దగ్గరపడుతున్నా కూడా బాబు గంటాల మధ్యన గ్యాప్ అలాగే ఉంది అంటున్నారు.
అయితే.. గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారంటూ గత ఎన్నికల నుంచే వినిపిస్తోంది. ఇటీవల వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా గంటా వైసీపీలోకి వస్తున్నాడని చెప్పడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ మీడియా చానల్ గంటాను వివరణ కోరింది. తనపై ఇప్పుడే కాదు, గతంలోనూ చాలాసార్లు పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయని గంటా వెల్లడించారు. తన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలోకి వెళ్లడంపై ఆయన స్పందిస్తూ.. కాశీ విశ్వనాథ్ ఒక్కడే తనకు అనుచరుడు కాదని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో చాలామంది పార్టీలు మారారని, ఒకవేళ తాను పార్టీ మారాలనుకుంటే వాళ్లతోనే కలిసి వెళ్లేవాడ్నని, వాళ్లను ముందు పంపి, తాను వెనుక వెళ్లాల్సిన అవసరం లేదని గంటా వివరించారు.
Also Read: బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్షకు సిద్ధమా..? టీఆర్ఎస్‌కు రేవంత్ సవాల్
తాను ఇప్పటివరకు పనిచేసిన నాయకుల్లో ది బెస్ట్ చంద్రబాబేనని స్పష్టం చేశారు. అయితే, 2019 ఎన్నికల సమయంలో చిన్న తేడా వచ్చిందని అన్నారు. 1999లో ఎంపీ అయినప్పటి నుంచి చంద్రబాబుతో ఎంతో అనుబంధం ఉందని, 2009లో ఓసారి తాను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లానని వెల్లడించారు. 2019 ఎన్నికల సమయంలో నారా లోకేశ్ విశాఖలో పోటీ చేయాలనుకున్నాడని, దాంతో తనను ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారని గంటా వివరించారు. లోకేశ్ విశాఖ నుంచి పోటీ చేయకపోవడంతో, తాను ఎంపీగా పోటీ చేయడం విరమించుకుని ఎమ్మెల్యే బరిలో దిగానని, ఈ అంశంలోనే చంద్రబాబుతో పొరపొచ్చాలు వచ్చాయని, బహుశా ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే అయ్యుంటుందని గంటా వివరించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్