Ganta Srinivasa Rao: రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక శైలి. ఆయన ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నపార్టీకే ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి మాత్రం తన అంచనాలు తప్పాయి. టీడీపీకి అధికారం వస్తుందని భావించినా అలా జరగలేదు. ఫలితంగా వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. దీంతో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తెరమీదకు తెస్తూ వారి కోసం రాజీనామా చేశారు. కానీ ఇంతవరకు ఆయన ఏ పార్టీలో కూడా చేరలేదు. దీంతో ఒక దశలో ఆయన వైసీపీలో చేరతారని, మరోవైపు జనసేన తీర్థం పుచ్చుకుంటారని, ఇంకోవైపు కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగింది.

ప్రతి ఎన్నికల్లో కొత్తగా ట్రెండ్ సృష్టించడం ఆయనకు అలవాటే. కానీ ఈసారి మాత్రం ఆయన సైలెంట్ అయిపోయారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా ఉన్నా ఆయన చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. 2019 నుంచి ఆయనకు కలిసిరావడం లేదు.దీంతో ఆయనకు పదవులు దక్కకుండా పోతున్నాయి. ఎప్పుడు ఏదో ఓ పదవిలో కొనసాగే టంటా కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Also Read: ‘సినీ పెద్ద’ గా చిరు పాత్ర పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ !
ఈ నేపథ్యంలో ఆయన పలు పార్టీల్లో చేరతారనే ప్రచారం జోరుగా సాగినా ఇప్పటివరకు ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకోలేదు. ఏ పార్టీలో చేరాలనే దానిపై డైలమాలో పడుతున్నారు. అధికార పార్టీకి జై కొడదామా? ప్రతిపక్షంలోనే ఉందామా? లేక జనసేనలో చేరి చక్రం తిప్పుతామా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి ఆయనకు అన్ని గేట్లు మూసుకుపోయే పరిస్థితి దాపురిస్తోందని సమాచారం.
అయితే కాపు సామాజికవర్గం బలం, బలగంపై ఆధారపడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏనాడు కుల ప్రస్తావన తీసుకురాని గంటా ప్రస్తుతం కాపు కులంపైనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకుని పోటీకి దిగాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. కాపు నేతలను తమ వైపుకు తిప్పుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనలో చేరి పవన్ కల్యాణ్ కు బూస్టింగ్ ఇవ్వాలని చూస్తున్నారనే వాదన వస్తోంది. ఏదిఏమైనా రాబోయే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మారుతాయని చెబుతున్నారు.
Also Read: కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం.. జగన్ కి అర్ధమవుతుందా ?