Ganji Chiranjeevi: గత ఎన్నికల్లో ఏపీలో దారుణ ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీని వీడుతున్న వారి సంఖ్య ఎక్కువుతోంది. చంద్రబాబు వయసు అయిపోవడం.. ఆయన వారసుడు లోకేష్ పై నమ్మకం లేకపోవడం.. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపుపై ఆశలు లేని వారంతా ప్రత్యామ్మాయం చూసుకుంటున్నారు. అయితే వైసీపీ..లేదంటే జనసేన వైపు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గంజి చిరంజీవి తాజాగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గంలో చిరంజీవి వైసీపీ తరుఫున పోటీచేసే అవకాశాలున్నాయని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. మంగళగిరిలో టీడీపీ అధినేత కుమారుడు నారాలోకేష్ పై పోటీకి చిరంజీవిని దింపుతారని అంటున్నారు.
Also Read: Noida Twin Towers Demolition: ట్విన్ టవర్స్ కూల్చే ముందు.. ప్లాట్‌లో నిద్రపోయిన వ్యక్తి..!
2019లో నారా లోకేష్ మంగళగిరి నుంచే పోటీచేశారు. వైసీపీ తరుఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా లోకేష్ ను ఓడించడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. ఇక నారా లోకేష్ కంటే ముందు మంగళగిరిలో టీడీపీ తరుఫున చిరంజీవి పోటీచేసి అతి తక్కువ ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఈసారి వైసీపీ తరుఫున చిరంజీవి టికెట్ ఆశిస్తున్నారు. ఆళ్ల కంటే తానే బెటర్ అని.. తనకే టికెట్ ఇవ్వాలని చిరంజీవి అప్పుడే జగన్ నుంచి హామీ కోసం ఒత్తిడి తెచ్చారడట.

కానీ ఆళ్ల వంటి సీనియర్ ను కాదని జగన్.. చిరంజీవికి ఇస్తాడా? ఆళ్లను ఎంపీగానో లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read:MP Gorantla Madhav Video Issue: గోరంట్ల మాధవ్ ఘటనపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. చర్యలకు ఆదేశం
https://www.youtube.com/watch?v=5THwJgxJGv0