Chandrababu On PK: ప్రశాంత్ కిషోర్ రూట్ మార్చారు. జగన్ ను వదిలించుకుని చంద్రబాబు చెంతకు చేరారు. గతంలో వైసిపి పనిచేసిన పీకే ను తన వైపు తిప్పుకుని చంద్రబాబు అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటనతో వైసీపీ శ్రేణులకు కూడా ఒక రకమైన షాక్ తగిలింది. గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేస్తున్నప్పుడు చంద్రబాబుతో పాటు ఆయన అనుకూల మీడియా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎల్లో మీడియాలో ప్రత్యేక కథనాలు సైతం వచ్చాయి. ఇప్పుడు అదే పీకే మంచివాడు అయిపోయాడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పీకే టిడిపి వైపు యు టర్న్ తీసుకోవడంతో వైసిపి సోషల్ మీడియా రెచ్చిపోతుంది. గతంలో పీకే పై చంద్రబాబు చేసిన కామెంట్స్ ను ఇప్పుడు ట్రోల్ చేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు పీకే బందిపోట్ల నాయకుడు, నేడు టిడిపికి అల్లుడైపోయాడని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. బిహారి క్రిమినల్ అవసరం వచ్చాడా చంద్రబాబు? కన్న పుత్రుడు, దత్తపుత్రుడు అసమర్థులని సైబర్ నేరగాడిని తెచ్చుకున్నావా? అంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. నాడు పీకేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.
చంద్రబాబు చేసిన ఓ కామెంట్ అయితే విపరీతంగా వైరల్ అవుతోంది. ” విన్నారా తమ్ముళ్లు పీకే అనే పేరు. జగన్ కు ఆయన పెద్ద కన్సల్టెంట్. ఇప్పుడు మొత్తం ఎనిమిది లక్షల ఓట్లు తీసేశారు. అదేంటో నాకు అర్థం కావడం లేదు. చివరికి నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు. ఏమనుకుంటున్నారు? ఇదేమైనా బిహారా? కాదు ఇది ఏపీ తోక కట్ చేస్తాం తప్ప.. నీ ఆటలు సాగనివ్వం. తోక తిప్పనివ్వం. వీళ్లకు తోడుగా బీహార్ నుంచి ఒక అతను వచ్చాడు. అతను నోటీరియస్ డెకాయిట్. ఒక పెద్ద నేరస్తుడు. బందిపోట్ల నాయకుడు” అంటూ చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైసీపీ శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి.