Gajendra Singh Shekhawat: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వేడి పెరుగుతోంది. వడ్ల కొనుగోలు విషయంలో మొదలైన ఈ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ వరుసగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. మొదట సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ వడ్ల కొనబోమని స్పష్టం చేస్తుంటే, రాష్ట్రంలో అదే పార్టీ నాయకులు వరి పండించడం ఏంటని ప్రశ్నించారు. అలాగే బండి సంజయ్‌పై వ్యక్తిగతంగా దూషణలు చేశారు.
విమర్శలు.. ప్రతివిమర్శలు..
కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన మాటలకు బండి కుమార్ కూడా స్పందించారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. రైస్ మిల్లర్లతో కుమ్మైక్కై రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ కి అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి పండటం లేదని అన్నారు. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వమే వరిని కొనుగోలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని విమర్శించారు.
దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. వరి సాగుపై అబద్దం చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు వస్తే హెలిక్యాప్టర్ ఇచ్చి పంపిస్తానని, వరి సాగు నిజమో కాదో వారే తేల్చుకోవాలని చెప్పారు. అనంతరం కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. తెలంగాణపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. హైకోర్టు విభజనలో అలసత్వం ప్రదర్శించారని అన్నారు. యూనివర్సిటీలు కేటాయించలేదని ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలను ఇంకా పరిష్కరించడం లేదని అన్నారు. దీనిపై ఎన్నో సార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించామని అన్నారు. వారి సూచన మేరకు సుప్రీం కోర్టులో వేసిన కోర్టును కూడా ఉపసంహరించుకున్నామని అన్నారు. కానీ ఇప్పటికీ దానికి పరిష్కారం చూపలేదని అన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షకావత్ డిమాండ్ చేశారు. కేంద్రం డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు.
డ్రామా అంతే మీదే కేసీఆర్- షకావత్
సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలకు కేంద్ర జలశక్తి మంత్రి షకావాత్ స్ట్రాంగ్ గా రిప్లయ్ ఇచ్చారు. డ్రామాలు కేసీఆర్ ఆడుతున్నారని, తాము ఆడటం లేదని చెప్పారు. గత అక్టోబర్ లో రెండు రాష్ట్రాలతో తాను అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడానని తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాటాలను పంచాలని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసు వేసినందున.. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పానని తెలిపారు. రెండు రోజుల్లో కేసు వాపసు తీసుకొని మళ్లీ మీకు సమాచారం అందిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. కానీ 7 నెలల తరువాత కేసు వాపసు తీసుకున్నారని తెలిపారు. తరువాత కొన్ని కారణాల వల్ల అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదని అన్నారు. సీఎం కేసీఆర్ అలసత్వం ప్రదర్శిస్తూ, తమవి డ్రామాలు అనడం సరికాదని అన్నారు. ఆయనే డ్రామాలు ఆడుతూ ఇలా అనడం తప్పని అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడకూడదని చెప్పారు. కొన్ని రోజుల క్రితం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో తన పేరు ప్రస్తావించినందున తాను సమాధానం చెబుతున్నానని చెప్పారు.
Also Read: KCR VS BJP: బీజేపీ బుట్టలో పడిందా? కేసీఆర్ ప్లాన్ సక్సెస్?
సీఎం స్పందన ఎలా ఉంటుందో ?
వరుసగా రెండు రోజులు ప్రెస్ మీట్ నిర్వహించారు సీఎం కేసీఆర్. తరువాత మంత్రులు మాట్లాడారు. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి షకావత్ సీఎంకు రిప్లయ్ ఇచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రస్తుతం మాటల యుద్దం నడుస్తోంది. ఇది ఎప్పటికి ముగుస్తుందో తెలియడం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేయనుంది.
Also Read: Chennai Rains: తమిళనాడు కన్నీటిసాగరం.. ఎస్ఐ రాజేశ్వరి చూపిన సాహసం.. వైరల్ వీడియో