KCR: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటాలో పదవులు ఎవరిని వరిస్తాయో తెలియడం లేదు. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధినేత కేసీఆర్ తర్జనభర్జన పడుతన్నట్లు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల కోటాలో 12 మందిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 4తో వారి పదవీకాలం ముగియనుండటంతో వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ఆశావహుల జాబితా పెద్దదైపోతోంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారో అనే దానిపై అందరిలో ఆసక్తి కలుగుతోంది. ఇదివరకే ఉన్న వారిని కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పురాణం సతీశ్, వరంగల్ లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండలో చిన్నపరెడ్డి, మెదక్ లో భూపాల్ రెడ్డి, నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత, ఖమ్మంలో బాలసాని లక్ష్మీనారాయణ, కరీంనగర్ లో నారదాసు లక్ష్మణరావు భానుప్రసాద్ రావు, మహబూబ్ నగర్ లో కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, రంగారెడ్డి లో పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ల పదవీ కాలం ముగియనుంది.
ఇందులో ఎంత మందికి మళ్లీ పదవులు వస్తాయో తెలియడం లేదు. ఒకవేళ సీటు దక్కకపోతే పార్టీ మారేందుకు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ బాస్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియడం లేదు. పాత వారికి చాన్స్ ఇస్తారా లేక కొత్త వారిని తీసుకుంటారా అనే దానిపై అందరికి అనుమానాలు వస్తున్నాయి.
Also Read: KCR VS BJP: బీజేపీ బుట్టలో పడిందా? కేసీఆర్ ప్లాన్ సక్సెస్?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం రాని వారిని బుజ్జగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందరికి అవకాశాలు రావని తెలుస్తోంది. ఆశావహుల చిట్టా పెరిగిపోతున్నందున అందరి కోరికలు నెరవేరేలా కనిపించడం లేదు. అందుకే సీట్లు దక్కని వారు నొచ్చుకోకుండా వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: సీఎంకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన కేంద్ర మంత్రి.. కేసీఆర్ ఎలా స్పందిస్తారో ?