G20 Summit 2023
G20 Summit 2023: ఢిల్లీ వేదికగా నిర్మించిన భారత్ మండపంలో రెండు రోజులపాటు నిర్వహించిన జీ_ 20 సదస్సు ముగిసింది. వచ్చే ఏడాది బ్రెజిల్ దేశానికి అధ్యక్ష పదవిని భారత్ అప్పగించింది. సుమారు రూ. 4,100 కోట్లకు పైచిలుకు నగదును భారత్ ఈ సమావేశాల కోసం వెచ్చించింది. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కనివిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ప్రపంచ దేశాలు అధినేతలు రెండు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేశారు. సరే వీటివల్ల భారత్ ఎటువంటి ప్రయోజనం పొందుతుంది? కేవలం ఆర్థికపరమైన అంశాల కు సంబంధించి చర్చలు జరిన నేపథ్యంలో సామాన్యులకు ఏం లాభం ఉంటుంది? ఈ సమావేశాల వల్ల భారత్ స్థాయి ఏమైనా పెరుగుతుందా?
జి20 వార్షిక సదస్సు, పంచ ఆర్థిక వ్యవస్థ కోసం ఒక ఉన్నతమైన లక్ష్యాలతో కూడిన సమన్వయమైన విధానాన్ని అనుసరించడం కోసం ప్రపంచ నాయకులను ఒక్కచోట చేర్చింది. కానీ తన ఆశల పట్ల అది ఎంత పురోగతి సాధించింది అనేది ఒక్కసారి పరిశీలన చేసుకుంటే.. 1999లో ఏర్పడినప్పటి నుంచి జీ_20 ఉమ్మడి ప్రకటనలు చాలావరకు శుష్క తీర్మానాలే. సభ్య దేశాల పనితీరు ఆశించినంతగా లేనప్పుడు, స్పష్టమైన పరిణామాలు ఉండవు. 2021 లో రోమ్ లో నిర్వహించిన సదస్సులో జీ_20 నాయకులు భూ తాపాన్ని, అర్థవంతమైన, చర్యలతో పరిమితం చేస్తామని ప్రకటించారు. విదేశాలలో బొగ్గు విద్యుత్ ప్లాంట్లకు ఆర్థిక సహాయం అందించడాన్ని ఇస్తామని ప్రకటించారు. కానీ రోమ్ సదస్సు ప్రకటన దేశీయ బొగ్గు పెట్టుబడులను వదిలి పెట్టేసింది. 2022లో, అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. జి 20 ప్రకటనలో, బొగ్గు వినియోగాన్ని వెంటనే ముగించాలని విషయంపై శాస్త్రీయ ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, 2023లో బొగ్గు పై పెట్టుబడి మరో 10% పెరిగి 150 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
90 ల కాలం చివరిలో కరెన్సీ విలువ తగ్గింపులో వెల్లువ తర్వాత ఆర్థిక మంత్రుల సమావేశం తో జి20 ప్రారంభమైంది. ఒక దశాబ్దం తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ నాయకుల వార్షిక సమావేశానికి జీ_20 నాంది పలికింది. ఈ కూటమిని నెలకొల్పిన దేశాలు, తర్వాత పెరుగుతున్న శక్తులు రెండింటినీ సమావేశ పరచడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా పరీక్షించవచ్చని విశ్వసించారు. ఈ విశ్వాసం సరైనదేనని ముందస్తు ఆధారాలు సూచించాయి. 2008, 2009లో 4 ట్రిలియన్ డాలర్ల విలువైన చర్యలకు అంగీకరించడం ద్వారా, విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి బ్యాంకు సంస్కరణలను ప్రారంభించడం ద్వారా, ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించినందుకు చాలా మంది నిపుణులు జీ_20ని ప్రశంసించారు. 2016లో చైనాలోని హాంగ్ జో లో జరిగిన జీ _20 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ సమస్యకు సంబంధించి పారిస్ ఒప్పందంపై తమ రెండు దేశాలు సంతకం చేస్తాయని అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా నాయకుడు షీ జిన్ పింగ్ ప్రకటించారు. దీంతో ఒక్కచోట నాయకులను చేర్చే శక్తిని జి20 ప్రపంచానికి చూపించింది. ఇటీవల అంటే గడచిన 2021 లో ప్రతి దేశానికి కనీసం 15% ప్రపంచ కనిష్ట పన్నుతో కూడిన ప్రధాన పన్ను సవరణకు జి20 మద్దతు ఇచ్చింది.
అమెజాన్ వంటి బడా అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించే దేశాలలో కార్యాలయాలు లేకపోయినప్పటికీ పనులు చెల్లించాల్సిన అవసరం ఉన్నన్ని కొత్త నిబంధనకు కూడా ఇది మద్దతు ఇచ్చింది. ప్రభుత్వాల ఆదాయానికి బిలియన్లను అదనంగా జోడించడమే కాకుండా, పన్నుల స్వర్గధామాలను ఏర్పరిచి, కార్పొరేషన్లకు చోదక శక్తిగా మార్చడానికి జీ_20 ప్రణాళిక హామీ ఇచ్చింది. కానీ కూటమి చేసిన అనేక ప్రకటనల మాదిరిగానే, వాటి తదుపరి అమలు బలహీనంగా ఉంటూ వచ్చింది. గ్లోబల్ టాక్స్ ఒప్పందం సరైన దిశలో ఒక ముఖ్యమైన అడుగు అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఈ సంవత్సరం ప్రకటించింది. కానీ అది ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. జీ_20 ప్రారంభమైనప్పుడు, ప్రపంచాన్ని ఎలా కలిపి ఉంచాలని దానిపై మరింత ఏకాభిప్రాయం ఏర్పడింది. స్వేచ్ఛ వాణిజ్యం పెరిగింది. అధికారం కోసం పోటీ ఒక పాత జ్ఞాపకంలాగే కనిపించింది. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటి వయస్సు మళ్ళిన సంస్థల స్థానంలో జి 20 విస్తృతమైన అధికార స్థావరంగా దారితీస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆశావాదులు భావించారు. ఇప్పటికీ ఆ ఆశలు అలాగే ఉన్నాయి.
ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం తాజా ఉదాహరణ. కానీ విభేదాలు జీ_20 జట్టు ప్రయత్నాలను దెబ్బ కొట్టాయి. చైనా, అమెరికా తీవ్ర పోటీదారులుగా మారాయి. కోవిడ్ మహమ్మారి, రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాల తర్వాత ఆర్థిక వ్యవస్థలు ప్రమాదకరంగా మారాయి. జాతీయ వాదం పెరిగింది. యుద్ధ రంగానికి దూరంగా ఉన్న దేశాల్లో ఆహారం, ఇంధనం ధరలు పెరిగాయి. కొంతమంది విమర్శకులు జీ_20ని తొలగించాలనుకుంటున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ ఏడాది సమావేశానికి రాకపోవడం వల్ల అది ఇప్పటికే బలహీన పడిందని చాలామంది అంటున్నారు. అయితే జీ_20 వైఫల్యాలు అంతర్జాతీయ సంస్థలలో ఆధునికీకరణ అవసరాన్ని సూచిస్తాయి. గత శని, ఆదివారాల్లో భారత్ లో జరిగిన సమావేశాలు దీన్నే ప్రతిబింబించాయి. ఈ సమావేశాల ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని మరింత మెరుగ్గా ప్రదర్శించింది. అమెరికా వంటి దేశాలను విస్తృతంగా ఆకర్షించింది. తమ దేశం విలువైన మానవ వనరులకు కేంద్ర బిందువు అని ప్రకటించింది. తమ దేశం పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తే ఎలాంటి అద్భుతాలు ఆవిష్కృతమవుతాయో క్షేత్రస్థాయిలో చూపించింది. అయితే ఈ సమావేశం ద్వారా ఐక్యరాజ్యసమితిలో భద్రత మండలి కి సంబంధించి శాశ్వత సభ్యత్వానికి అడ్డంకులు తొలగిపోయినట్టేనని అందరూ భావిస్తున్నారు. భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తే ఇంకా చాలా పరిణామాలు చోటుచేసుకుంటాయని ప్రపంచ రంగ నిపుణులు చెబుతున్నారు.