https://oktelugu.com/

రాజధానిలో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్ మెట్రో రైళ్ళను ఈ నెల మూడోవ వారం నుండి పున:ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. విద్యా సంస్థలు,థియేటర్స్ మినహా దాదాపుగా ఎకనమిక్ యాక్టివిటీస్ అన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలు,పారిశ్రామిక కార్యకలాపాలు పున:ప్రారంభమయ్యాయి. అయితే హైదరాబాద్‌ లో సిటీ బస్సులు,మెట్రో, ఎంఎంటీఎస్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో.. ఆఫీసులకు,పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సిటీ బస్సులకు కూడా రవాణా శాఖ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సాధారణంగా హైదరాబాద్‌ లో ప్రతీరోజూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 3, 2020 / 08:00 PM IST
    Follow us on

    హైదరాబాద్ మెట్రో రైళ్ళను ఈ నెల మూడోవ వారం నుండి పున:ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. విద్యా సంస్థలు,థియేటర్స్ మినహా దాదాపుగా ఎకనమిక్ యాక్టివిటీస్ అన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలు,పారిశ్రామిక కార్యకలాపాలు పున:ప్రారంభమయ్యాయి. అయితే హైదరాబాద్‌ లో సిటీ బస్సులు,మెట్రో, ఎంఎంటీఎస్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో.. ఆఫీసులకు,పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సిటీ బస్సులకు కూడా రవాణా శాఖ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

    సాధారణంగా హైదరాబాద్‌ లో ప్రతీరోజూ దాదాపు 33 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం సిటీ బస్సులు లేకపోవడంతో సొంత వాహనాల పైనే ఆధారపడుతున్నారు. సొంత వాహనాలు లేనివారు దూర ప్రాంతంలో ఉన్న తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం జూన్ 8 నుంచి సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వీరికి కష్టాలు తప్పుతాయి. అయితే కరోనా నేపథ్యంలో సిటీ బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతారన్నది వేచి చూడాలి.

    ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 8వ తేదీ నుంచి గ్రేటర్‌ లో సిటీ బస్సులను నడిపేందుకు ఆయన సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బస్సులు నడుస్తుండటంతో.. హైదరాబాద్‌ లోనూ బస్సు సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.