మోడీ, వన్ నేషన్-వన్ మార్కెట్

కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. వన్ నేషన్ వన్ మార్కెట్ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక పై రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేలా అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు చేసేందుకు నిత్యవసరాల చట్టాన్ని సైతం సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి  ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల […]

Written By: Neelambaram, Updated On : June 4, 2020 12:26 pm
Follow us on

కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. వన్ నేషన్ వన్ మార్కెట్ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక పై రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేలా అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు చేసేందుకు నిత్యవసరాల చట్టాన్ని సైతం సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి  ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని రైతుల ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడుతుందన్నారు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీతో ఏర్పడుతున్న ఇబ్బందులు ఇక రైతులకు ఉండకుండా సులభతరం చేసినట్లు తెలిపారు.