సీఎంవో నుంచి ప్రవీణ్ ప్రకాశ్ ఔట్.. షాకిచ్చిన జగన్.. కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వంలో అధికార వర్గాల్లో మంచి పేరున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ను హఠాత్తుగా సీఎంవో నుంచి తొలగించారు. ఆయనను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన బాధ్యతలను రేపు ముత్యాలరాజు అనే మరో సీనియర్ ఐఏఎస్ కు అప్పగించారు. ప్రవీణ్ ప్రకాశ్ ను సీఎంవో నుంచి తొలగించడం రాజకీయవర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. అధికార వర్గాల్లో మాత్రం ఇప్పటికే ఆలస్యం అయిందన్న ప్రచారం సాగుతోంది. సీఎం జగన్ కనుసన్నల్లో ఇన్నాళ్లు […]

Written By: Srinivas, Updated On : July 14, 2021 11:38 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వంలో అధికార వర్గాల్లో మంచి పేరున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ను హఠాత్తుగా సీఎంవో నుంచి తొలగించారు. ఆయనను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన బాధ్యతలను రేపు ముత్యాలరాజు అనే మరో సీనియర్ ఐఏఎస్ కు అప్పగించారు. ప్రవీణ్ ప్రకాశ్ ను సీఎంవో నుంచి తొలగించడం రాజకీయవర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. అధికార వర్గాల్లో మాత్రం ఇప్పటికే ఆలస్యం అయిందన్న ప్రచారం సాగుతోంది.

సీఎం జగన్ కనుసన్నల్లో ఇన్నాళ్లు పనిచేసిన ఆయన ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేసే క్రమంలో అధికారులే బాధ్యులు అవుతారు. ఇవేమీ ప్రవీణ్ ప్రకాశ్ ను ఇబ్బంది పెట్టలేదు. కానీ కొన్నాళ్లుగా ఆయన అమరావతిలో కనిపించడం లేదు. సీఎం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలను నిర్లక్ష్యం చేశారు. కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

దీంతో కొంత కాలంగా ఢిల్లీలోనే ఉంటున్నారు. కానీ ఆయన ట్రాక్ రికార్డు ప్రకారం కేంద్ర సర్వీసులోకి తీసుకోవడానికి ఇబ్బందులు ఎధురవుతున్నాయి. ప్రవీణ్ ప్రకాశ్ ఢిల్లీలోనే ఉండి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో పని చేయడానికి ఆయనకు ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. దీంతో బాధ్యతలనుంచి తప్పించినట్లుగా ప్రచారం సాగుతోంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఆయన ఢిల్లీలోనే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉండేవారు. ఆయనపై టీటీడీ నిధుల దుర్వినియోగం కేసులో విచారణ కూడా చేయించారు. అయితే అనూహ్యంగా సీఎం జగన్ నేరుగా ఆయనను సీఎంవోలోకి తీసుకురావడంతో దశ తిరిగింది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయారు.