ఆగస్టు నుంచి అందరికీ.. రోజుకు కోటి వ్యాక్సిన్లు

కరోనా వ్యాక్సిన్లు లేక అల్లాడుతున్న దేశ ప్రజలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యాక్సిన్ల కొరతతో ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. 18-45 ఏళ్ల వారికి టీకాలు వేస్తామని కేంద్రం ప్రకటించినా.. కొరతతో ఎవరికీ వేయని పరిస్థితి నెలకొంది.  అయితే వ్యాక్సిన్ కంపెనీలతో చర్చలు జరిపిన మోడీ సర్కార్ అన్ని కంపెనీలకు అనుమతులు ఇస్తూ ఇప్పుడు దేశ ప్రజలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి […]

Written By: NARESH, Updated On : June 2, 2021 10:41 am
Follow us on

కరోనా వ్యాక్సిన్లు లేక అల్లాడుతున్న దేశ ప్రజలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యాక్సిన్ల కొరతతో ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. 18-45 ఏళ్ల వారికి టీకాలు వేస్తామని కేంద్రం ప్రకటించినా.. కొరతతో ఎవరికీ వేయని పరిస్థితి నెలకొంది.  అయితే వ్యాక్సిన్ కంపెనీలతో చర్చలు జరిపిన మోడీ సర్కార్ అన్ని కంపెనీలకు అనుమతులు ఇస్తూ ఇప్పుడు దేశ ప్రజలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన చేసింది.

ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి రోజుకు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని ప్రజలకు ఊరటనిచ్చే కబురుచెప్పింది. కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్ దృష్ట్యా దేశంలో కొరత తీర్చేందుకు కేంద్రం సిద్ధమైంది.

ఇప్పటికే తొలి డోసు వేసుకున్న వారు సెకండ్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. వారికి సరఫరా చేయలేని పరిస్థితుల్లో కేంద్రం ఉంది. ఈ క్రమంలోనే టీకాల ఉత్పత్తిని పెంచి ఆగస్టు నాటికి డిమాండ్ కు అనుగుణంగా వ్యాక్సిన్ సరఫరా చేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతం అవసరాల ప్రకారం దేశంలో రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులు అవసరం ఉంది. అయితే ఆ మేరకు సరఫరా మాత్రం లేదు. రోజుకు 20 లక్షల స్థాయిలోనే ఇప్పటికీ వ్యాక్సినేషన్ జరుగుతూ ఉందని లెక్కలు చెబుతున్నాయి.

థర్డ్ వేవ్ వచ్చే డిసెంబర్ కు ముందే కేంద్రప్రభుత్వం రోజుకు కోటి వ్యాక్సిన్లను పంచి జనాలందరికీ వ్యాక్సినేషన్ చేయించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి వరకు దేశంలోని 18 ఏళ్లపై వయసు వారందరికీ వ్యాక్సిన్ అందించవచ్చని అంచనా వేస్తోంది.

ఈ ఏడాది చివరి వరకు 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్రం చెబుతోంది. రెండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని కేంద్రం అందుకుంటుందా? లేదా ? అన్నది వేచిచూడాలి.