రాపెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. రాహుల్ గాంధీ రాఫెల్ విమానాల వ్యవహారంలో ముడుపులు మారినట్లు ఆరోపణలు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న విశ్వాసంతో విచారణ కోసం న్యాయమూర్తిని నియమించింది. దీంతో ఈ వ్యవహారంలో పలువురికి ముడుపులు ముట్టినట్లుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాఫెల్ వ్యవహారం రాజకీయంగా దుమారమే రేపింది.
కానీ మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఇందులో అవినీతికి తావు లేదని తేల్చి చెప్పడంతో విచారణకు ఆదేశిస్తుందా అనే అనుమానాలు అందరికి కలుగుతున్నాయి. ఫ్రాన్స్ లో రాఫెల్ వ్యవహారంపై విచారణకు అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు రాఫెల్ కుంభకోణం వెనుక ఎవరి పాత్ర ఉందనే విషయాలు తేటతెల్లం కానున్నాయి.
ఫ్రాన్స్ లోనే లంచాలు చేతులు మారాయని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని మోడీ ప్రభుత్వం తక్కువ విమానాలను అత్యధిక ధరలకు కొనుగోలు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ ను భాగస్వామిగా చేర్చారని తెలుస్తోంది. కేంద్రం ఇప్పటికే ఇందులో అవినీతి జరగలేదని తేల్చేయడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
ఫ్రాన్స్ లో జరిగే విచారణలో అవినీతి జరిగినట్లు తేలితే భారతదేశంలో కూడా పెద్ద చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ లో విచారణ ఇక్కడ తీరుగా ఆలస్యం కాదనే విషయం తెలుస్తోంది. గతంలో రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణం ఎలాగో రాఫెల్ కుంభకోణం కూడా అలాగే అని పేర్కొంటున్నారు. బీజేపీ అదికారంలో ఉన్నంత కాలం ఈ డీల్ పై విచారణ జరగదని తెలుస్తోంది. ఫ్రాన్స్ వైపు నుంచి అవకాశం రావడంతో ఏళ్ల తరబడి సాగకుండా తొందరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఏర్పడింది.