Free Gas Cylinder : ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ పథకం కింద మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులను ముందుగానే అర్హులైన వారి ఖాతాలలో వేస్తామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీ నుంచి అన్ని రేషన్ షాపులలో రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు వికలాంగులు మాత్రం రేషన్ షాపుల దగ్గరకు రావాల్సిన అవసరం లేదని వాళ్లకు డీలర్లే ఇంటికి డోర్ డెలివరీ చేస్తారని మంత్రి తెలిపారు. రేషన్ కంపెనీలలో తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తున్నామని అలాగే మధ్యాహ్న భోజన సమయానికి త్వరలో రేషన్ పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా దీపం 2 పథకానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన స్పష్టం చేశారు. ఇప్పటివరకు రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని రాయితీ పొందని లబ్ధిదారులకు ఆయన క్లారిటీ ఇచ్చారు. రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన తర్వాత కూడా కొంతమంది లబ్ధిదారులు తమ అకౌంట్లో రాయితీ డబ్బులు జమ కాలేదని తెలిపారు.
అయితే కొన్ని సాంకేతిక కారణాలతో ఇప్పటివరకు కొంతమంది లబ్ధిదారుల ఖాతాలలో రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు పడలేదని తెలిపారు. త్వరలోనే వీళ్ళందరికీ కూడా రెండవ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను వాళ్ళ ఖాతాలలో జమ అయ్యేలాగా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీపం 2 పథకం కింద తీసుకోబోయే మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ పై కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలలో ముందుగానే డబ్బులను జమ చేసే ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా కేవైసీ చేయించుకోకపోతే వెంటనే చేయించుకోవాలని తెలిపారు.
Also Read : రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్.. బుకింగ్ అప్పటి నుంచి..!
లేకపోతే వాళ్ళందరి ఖాతాలలో దీపం 2 పథకం కింద సబ్సిడీ డబ్బులు పడవని మంత్రి తెలిపారు. కేవైసీ పూర్తి చేసుకున్న వారి ఖాతాలలో రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు జమ చేస్తారన్నారు. ఇప్పటివరకు రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను పొందని లబ్ధిదారులందరూ వెంటనే సదరు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అలాగే మరి కొంతమందికి బ్యాంకు ఖాతాలకు ఆధార లింక్ అవ్వని కారణంగా కూడా అకౌంట్ లో డబ్బులు జమ కాలేదని తెలిపారు. దీనిని కూడా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాల్సిందిగా మంత్రి సూచించారు.