ఆ నలుగురికి నాలుగో డెత్ వారెంట్

నిర్భయ దోషులకు నాలుగో డెత్ వారెంట్ జారీ చేసింది పాటియాలా కోర్ట్. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని కోర్టు ఆదేశాలు చేసింది. వరుసగా మూడుసార్లు ఉరి వాయిదా పడింది. ఇప్పుడు నాలుగో డెత్ వారెంట్ ఈ రోజు జారీ అయింది. మొదటి జనవరి 22న అది వాయిదా పడింది. తర్వాత ఫిబ్రవరి1, తర్వాత మార్చి 3 డెత్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడు నాలుగోసారి మార్చి 20న ఉరితీయాలని తాజాగా దోషులను […]

Written By: Neelambaram, Updated On : March 5, 2020 4:47 pm
Follow us on


నిర్భయ దోషులకు నాలుగో డెత్ వారెంట్ జారీ చేసింది పాటియాలా కోర్ట్. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని కోర్టు ఆదేశాలు చేసింది. వరుసగా మూడుసార్లు ఉరి వాయిదా పడింది. ఇప్పుడు నాలుగో డెత్ వారెంట్ ఈ రోజు జారీ అయింది. మొదటి జనవరి 22న అది వాయిదా పడింది. తర్వాత ఫిబ్రవరి1, తర్వాత మార్చి 3 డెత్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడు నాలుగోసారి మార్చి 20న ఉరితీయాలని తాజాగా దోషులను ఉరితీయాలని కోర్టు తెలిపింది.

దోషులను చట్టంలో లొసుగులను ఉపయోగించుకుంటూ.. ఉరిశిక్షను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి మూడు సార్లు ఉరి వాయిదా పడింది. నాలుగోసారి డెత్ వారెంట్ జారీ అయింది.

ఇప్పటి వరకు న్యాయపరంగా, రాజ్యాంగ బద్ధంగా వీరికున్న క్షమాభిక్ష అవకాశాలన్నీ ఒకరి తర్వాత ఒకరు వినియోగించుకుంటూ వచ్చారు. అయితే ఈ నాలుగోసారైనా ఉరి శిక్షను అమలుపరిచి తన కూతురి అఘాయిత్యానికి తగిన న్యాయం చేయాలని నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.