https://oktelugu.com/

ఆ నమ్మకంతోనే ఐటెం గర్ల్ గా మారిందా ?

సినిమారంగంలో విజయాలు శాశ్వతం కాదు . ఊహించని రీతిలో దశ, దిశా మారి పోతుంటాయి. ఇక్కడ దొరికిన అవకాశాన్ని అంది పుచ్చుకొని ముందుకు సాగాలి. అంతే గాని మీన మేషాలు లెక్కించ కూడదు. కెరీర్ లో తిరుగులేని సక్సెస్ లు చూసిన వాళ్ళు కూడా అర్ధాంతరంగా మరుగున పడిపోతారు. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2014 లో తెలుగు నాట హీరోయిన్ గా అడుగు పెట్టి ఆదిలో మంచి విజయాలు చవి చూసిన హెబ్బా పటేల్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 5, 2020 / 05:01 PM IST
    Follow us on

    సినిమారంగంలో విజయాలు శాశ్వతం కాదు . ఊహించని రీతిలో దశ, దిశా మారి పోతుంటాయి. ఇక్కడ దొరికిన అవకాశాన్ని అంది పుచ్చుకొని ముందుకు సాగాలి. అంతే గాని మీన మేషాలు లెక్కించ కూడదు.

    కెరీర్ లో తిరుగులేని సక్సెస్ లు చూసిన వాళ్ళు కూడా అర్ధాంతరంగా మరుగున పడిపోతారు. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2014 లో తెలుగు నాట హీరోయిన్ గా అడుగు పెట్టి ఆదిలో మంచి విజయాలు చవి చూసిన హెబ్బా పటేల్ ఇపుడు దాదాపు కనుమరుగు అయ్యే స్థితి కొచ్చేసింది. అలాంటి సమయంలో ఆమెకు అతిధి పత్రాలు వెతుక్కొంటూ వస్తున్నాయి. రీసెంట్ గా భీష్మ చిత్రం లో తళుక్కున మెరిసిన హెబ్బా పటేల్ ఆ చిత్రం సాధించిన విజయం తో కాస్త ఊపిరి పీల్చు కొంది. కెరీర్ ప్రారంభంలో అలా ఎలా , కుమారి 21 ఎఫ్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ చేసిన హెబ్బా పటేల్ త్వరలో తన లక్కీ జోడి రాజ్ తరుణ్ సరసన ఒరేయ్ బుజ్జిగా చిత్రం లో రెండో హీరోయిన్ గా కనిపించ బోతోంది. ఈ చిత్రం తో పాటు ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తోన్న రెడ్ చిత్రం లోకూడా ఒక ఐటెం సాంగ్ చేయబోతోంది. గతంలో ఐటెం సాంగ్ లతో పాపులర్ అయిన హీరోయిన్ ల మాదిరిగా తన కెరీర్ కూడా ఊపు అందుకొంటుందన్న నమ్మకం తో హెబ్బా పటేల్ ఈ విధంగా నర్తించేందుకు ఒప్పుకొంది.