Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపే తిరుగుతున్నాయి. ఆయన రీసెంట్ గానే ఉభయ గోదావరి జిల్లాలో ప్రారంభించిన ‘వారాహి విజయ యాత్ర’ కి అడుగడుగునా జనాలు నీరాజనం పలకడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో వైసీపీ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు జనాల్లో బాగా వెళ్తున్నాయి.
జనాలు వాటిని సంపూర్ణంగా నమ్ముతున్నారు కూడా. ఇదే అధికార వైసీపీ పార్టీ కి గుండెల్లో గుబులు ప్రారంభం అయ్యింది. ఇంతటి అనూహ్యమైన స్పందన వస్తుంది కదా, పవన్ కళ్యాణ్ పై ప్రత్యర్థులు ఏమైనా కుట్రలు చేసి దాడులు చెయ్యాలని చూస్తారేమో అని అభిమానులు భయపడుతూ ఉన్నారు. ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ నీ మీద చిన్న గీత పడినా తట్టుకోలేము, జాగ్రత్తగా ఉండు అన్నా అంటూ అభిమానులు ట్వీట్స్ వేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా నేడు రాజోలు జనసేన పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ‘నిన్న నేను రాజోలు మెయిన్ రోడ్డులో ర్యాలీ ద్వారా వస్తుంటే, నలుగురు క్రిమినల్స్ రాళ్లు పట్టుకొని కనిపించారు. మన సెక్యూరిటీ సిబ్బంది వారిని గుర్తించి వెంటనే పోలీసులకు పంపించారు. ఒక పార్టీ జనాల్లో మార్పు తీసుకొస్తుంది, ఎదుగుతుంది అంటే, ఆ పార్టీ ని సర్వనాశనం చెయ్యడానికి ఎన్ని కుట్రలైనా చేస్తారు. అన్నిటికీ మనం సిద్దపడి జాగ్రత్తగా ఉండాలి’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానుల్లో భయాందోళన కలిగిస్తుంది.
నిన్న జనప్రవాహం వేరే లెవెల్ లో ఉండడం తో పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనం మీద కాకుండా, మామూలు కారులోనే ర్యాలీ చేసాడు. వారాహి లో ఉంది ఉంటే ఇలాంటి సాహసాలు ఎవ్వరూ కూడా చేసి ఉండేవారు కాదని, ఆలస్యం అయినా వారాహి లోనే రావాలని అభిమానులు పవన్ కళ్యాణ్ ని కోరుతున్నారు.
నిన్న నేను రాజోలు మెయిన్ రోడ్ లో వస్తావుంటే రాళ్ళు పట్టుకుని 4 గురు క్రిమినల్స్ దొరికారు Cheif @PawanKalyan గారు 🙏🙏 pic.twitter.com/xp5eAKebhQ
— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) June 24, 2023