
ముఖ్యమంత్రి జగన్ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ప్రచారాల ఆర్భాటం కనిపిస్తుంది. ఆయన మరోసారి ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చేశారు. తన ఇంట్లో ఏర్పాటు చేసిన మీట నొక్కి ప్రారంభోత్సవాలు చేసే సీఎం ఈసారి14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయబోతున్నట్లుగా ప్రకటనలు జారీ చేశారు. పార్లమెంట్ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ అన్న హామీ మేరుకు ఈ శంకుస్థాపన చేస్తున్నారు. నిజానికి మెడికల్ కాజేజీలకు పూర్తిస్థాయిలో భూములు కూడా లేవు. కొన్నిచోట్ల సేకరించినా వివాదాల్లో ఉన్నాయి. వాటికి అన్ని అనుమతులు వచ్చాయా అంటే అదీ లేదని చెబుతున్నారు.
జగన్ సీఎం అవగానే శంకుస్థాపన చేసిన ఉద్ధానం ఆస్పత్రి కథ తెలుసుకోవాలి. సీఎం అయ్యాక 2019 సెప్టెంబర్ 3న జీవో 102 జారీ చేశారు.200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రం, రీసెర్చ్ కేందరం నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించింది. సిబ్బంది వేతనాలకు అయ్యే ఖర్చులకు సాలుకు రూ.8.3 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. అదే నెలలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు దాని నిర్మాణం చేపట్టలేదు.
2019-20, 20-21 ఆర్థిక సంవత్సరాల్లో రూ.50 కోట్లు కేటాయించింది. కానీ నిధులు విడుదల చేయలేదు. పునాదుల్లోనే తుప్పుపట్టిన ఇనుప రాడ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. సిబ్బంది నియామకం జరగలేదు. ఇక ఉద్ధానం రోగులకు ప్రతి ఐదు వందల మంది రోగులకు ఒక హెల్త్ వర్కర్, కిడ్నీ పేషెంట్లకు వారి సహాయకులకు ఉచిత బస్ పాస్ వంటి అనేక ప్రకటనలు అమలుకు నోచుకోలేదు. మాటలు కో టలు దాటుతాయ్.. చేతలు మాత్రం గడప దాటవన్నట్లుగా ప్రచారమే కానీ ఆచరణ లేదని తె లుస్తోంది.
సీఎం జగన్ మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడానికి కారణం అప్పులన్న సంగతి తెలిసిందే. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి రూ.16 వేల కోట్లు అప్పు కావాలి. ఈ డబ్బులతో మెడికల్ కాలేజీలు పె డతామని చెబుతున్నా వాటిని సంక్షేమ పథకాలకు వినియోగిస్తారని చెబుతున్నారు.