https://oktelugu.com/

వరుస సినిమాలతో బిజీ అవుతున్న శర్వానంద్

విభిన్న కధలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగే హీరోల్లో శర్వానంద్ ఒకరు . దర్శకుల సక్సెస్ ట్రాక్ తో సంబంధం లేకుండా కథకే ప్రాముఖ్యత ఇచ్చి సినిమాలు చేస్తుంటాడు . ఆ క్రమంలో `లై` వంటి డిజాస్టర్ సినిమా తీసిన హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చి `పడిపడిలేచెమనసు` సినిమా చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయినా తన పంధా మార్చుకోలేదు. ఇప్పుడు శర్వానంద్ అలాంటి రిస్కే మరోసారి తీసుకొంటున్నాడు. ఫెయిల్యూర్ డైరెక్టర్ చందు […]

Written By:
  • admin
  • , Updated On : May 8, 2020 / 10:42 AM IST
    Follow us on


    విభిన్న కధలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగే హీరోల్లో శర్వానంద్ ఒకరు . దర్శకుల సక్సెస్ ట్రాక్ తో సంబంధం లేకుండా కథకే ప్రాముఖ్యత ఇచ్చి సినిమాలు చేస్తుంటాడు . ఆ క్రమంలో `లై` వంటి డిజాస్టర్ సినిమా తీసిన హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చి `పడిపడిలేచెమనసు` సినిమా చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయినా తన పంధా మార్చుకోలేదు. ఇప్పుడు శర్వానంద్ అలాంటి రిస్కే మరోసారి తీసుకొంటున్నాడు. ఫెయిల్యూర్ డైరెక్టర్ చందు మొండేటితో శర్వానంద్ ఒక సినిమా చేయబోతున్నాడు. గత ఏడాది `సవ్యసాచి` వంటి ప్లాప్ సినిమా చేసిన చందు మొండేటిని నమ్మి ఒక సినిమా ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు చందు మొండేటి రీసెంట్ గా శర్వానంద్ కి ఓ కథ వినిపించాడట. ఆ కథ శర్వానందు కి బాగా నచ్చిందట… దాంతో ఆ సినిమాలో నటించడానికి ఓకే చెప్పేశాడని తెలుస్తోంది.

    ఘోరం.. రైలు చక్రాలక్రింద నలిగిన కూలి బ్రతుకులు!

    కాగా ప్రస్తుతం శర్వానంద్ ` శ్రీకారం `అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. మరో పక్క చందు మొండేటి కూడా నిఖిల్ సిద్దార్ధ్ తో ` కార్తికేయ 2 ` చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఆ క్రమంలో ఇద్దరూ తమ తమ సినిమాలు పూర్తి చేసాక ఈ కొత్త సినిమాని మొదలెడతారు .. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఒక పీరియాడికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది .1910 లో మొదలయ్యే ఈ చిత్రం 2121 నాటి పరిస్థితుల్లో ఎండ్ అవుతుందట…