RRR Movie Criticisms: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలై చాలా రోజులైంది.. ఇన్నాళ్లకు సినిమాపై నిశిత విశ్లేషణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ మూగబోయిన సినీ విమర్శకుల గొంతులు లేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీసిన చరిత్ర వక్రబాష్యాన్ని థియేటర్లలో చూడటానికి చాలామంది ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలో స్రీమ్ అవుతోంది. మధ్యమధ్యలో ఆపుతూ సినిమా చూపించామనిపిస్తున్నారు. సినిమాను ఇప్పుడు నిశితంగా చూస్తున్న విమర్శకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. నిర్మొహమాటంగా తమ విమర్శల్ని, అభ్యంతరాల్ని సంధిస్తున్నారు.

రిలీజ్ సమయంలోనే విమర్శలు..
వాస్తవానికి సినిమా రిలీజ్ సమయంలోనే ఒకరిద్దరు తమ అసంతృప్తిని తెలియజేశారు. సినిమాలోని సీన్లు గతంలో ఏయే సినిమాల్లో ఉన్నాయో.. రాజమౌళి వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నారో కూడా బయటపెట్టారు. ప్రభాకర్ జైనీ వంటి చిన్న నిర్మాత రాజమౌళి, జూనియర్, రాంచరణ్ కాంబో రోత క్రియేటివ్‌పై నిరసనను, అభ్యంతరాల్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వారు ఇంకొందరు కూడా చరిత్ర వక్రీకరణపై అభ్యంతరాలు తెలిపారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వాడ్రేవు చినవీరభద్రుడి రివ్యూ బాగా వైరల్ అవుతోంది. ఫేస్‌బుక్‌లో కనిపిస్తున్న ఆర్యన్ కృష్ణ రివ్యూ కూడా ఘాటుగా, పదునుగా ఉంది. చరిత్రకు వక్రభాష్యం చెప్పేలా ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌పై ఇప్పుడు డిబేట్ నడిపిస్తున్నారు.
Also Read: Poonam Bajwa : పూనమ్ ఎక్సర్ సైజ్.. చూస్తే మీకు చమటలు పడుతాయి!
ఆర్యన్ కృష్ణ ఏమన్నారంటే…
‘‘నీకు చరిత్ర తెలియకపోతే క్షమిస్తాం. కానీ బుకాయింపులకు పూనుకుంటే మాత్రం నిన్ను చీదరిస్తాం. నువ్వు మా సమకాలికుడివైనందుకు సిగ్గుపడతాం. త్యాగధనుల పేర్లను సొమ్ము చేసుకునే నీ లాంటి వాళ్లను అసహ్యించుకుంటాం. నీ సమర్ధకుల మనో వైకల్యానికి జాలిపడతాం’’ అని రాసుకొచ్చారు.
తెలుగు నేల మీద అద్భుత పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసిన ఇద్దరు చారిత్రిక వ్యక్తుల పేర్లను తీసుకుని సినిమా తీసి సొమ్ము చేసుకోవాలనుకోవడం లజ్జారాహిత్యం అని పేర్కొన్నారు. పరాయిపాలనకు, రాచరికానికి వ్యతిరేకంగా వేలాది మంది జనాన్ని సమీకరించి, వారిని ఉత్తేజితుల్ని చేసి స్వాతంత్య్రంవైపు, విముక్తి వైపు నడిపించిన ఇద్దరు త్యాగధనుల పేర్లను సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం అన్ని రకాల విలువల్ని వదులుకొని నడిబజార్లలో నిలబడగల వ్వాణిజ్య కక్కుర్తిగా అభివర్ణించారు.

ఒక తరం అంతరం ఉన్న ఇద్దరూ కలిసి తెల్లవాళ్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం అనే కథాంశంతో సినిమా తీస్తున్నారన్న వార్తల్ని మీడియా ద్వారా ప్రచారం చేయించి, జనాల్లో ఆసక్తి కలిగించి ఆ తరువాత ఆ ప్రచారానికీ ఏం సంబంధం లేదనడం, ఒక డిస్క్లెయిమర్ మన మొహాన పడేయడం ఈ మూవీ మేకర్స్ అనైతికతకు, వారి అవకాశవాదాన్ని సమర్ధించే వాళ్ల అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. ఒక డిస్క్లెయిమర్ ఇస్తే ఎన్ని అబద్ధాలైనా ఆడటానికి, ఎన్ని దబాయింపులకైనా పాల్పడటానికి, ఎన్ని వక్రీకరణలకైనా పూనుకోవడానికి, జనాల్ని ఎంత పిచ్చివాళ్లనైనా చేయడానికి లైసెన్స్ వస్తుందా అని ఘాటుగానే విమర్శించారు.
ఇక చినవీరభద్రుడైతే.. ఈ సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదన్నారు. ఓ థర్డ్ గ్రేడ్ స్టోరీగా అభివర్ణించారు. గిరిజన తెగల పేర్లు చెప్పి వారి కనీస సంస్కృతిని చూపించలేని అజ్ఞానం రాజమౌళిదని విమర్శించారు. ‘గోరింటాకు పెట్టించుకోడానికి గోండ్ల పిల్లను ఎత్తుకుపోతారా ఆమె తల్లిని చంపేసి? ఆ పిల్లని విడిపించడానికి ఎలుకల్ని బోనులో పట్టినట్లు పెద్ద పులుల్ని, సింహాల్ని పదుల సంఖ్యలో వేటాడి, బంధించి ఢిల్లీకి తీసుకుపోతాడా హీరో? ఏమన్నా కథా ఇది అసలు? దర్శకుడికి మతి మాలడం తప్పిస్తే!’ అంటూ రాసుకొచ్చారు. వినోదం పేరుతో ఇంత అతి పైత్యం చూపించారని విమర్శించారు. ఇలాంటి దర్శకులు తెలుగు సినిమాని, భారతీయ సినిమాని (ఇది పెనం ఇండియా అదే పాన్ ఇండియా సినిమా కదా) ఎదగనీకుండా కాళ్లు పట్టి గుంజుతూనే వుంటారు. వీళ్లకి సినిమా అంటే కళ కూడా అనుకోరు. ఓ వ్యాపారం మాత్రమే అనుకుంటారు. పోనీ ఆ వ్యాపారాత్మక సినిమాల్నైనా సృజనాత్మకంగా తీస్తారా అంటే వీళ్లకి అభూతకల్పనలకి, సృజనాత్మకతకి తేడా తెలిసి చావదు’ అని ఘాటైన పదాలతో విమర్శలు సంధించారు. విపరీతమైన హైప్ క్రియేట్ చేసి, సీఎంలను పట్టుకొని, కాళ్లా వేళ్లా పడి టికెట్ రేట్స్ పెంచుకొని, మీడియా మానేజ్ చేసి, జనాల్ని అడ్డగోలుగా దోచుకొని, హమ్మయ్య ఓ వేయి కోట్లు సంపాదించుకున్నామనే అనైతిక తృప్తి ఈ సినిమా రూపకర్తలదని పేర్కొన్నారు.
Also Read:Esther Anil : ‘దృశ్యం’ సినిమాలోని ఆ పాప అందాలు చూడతరమా?
Recommended videos
[…] […]
[…] […]